రెనో డస్టర్ అమ్మకాలకు సొట్ట పెడుతున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్

By Ravi

ఇలా జరుగుతుందని మనం ముందే ఊహించాం. అత్యంత సరమైన ధరకే మార్కెట్లోకి విడుదలైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ రెనో డస్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందని గతంలో చెప్పుకున్న సంగతి తెలిసినదే. జులై నెల అమ్మకాలు చూస్తే, ఈ ఊహ నిజమైందని స్పష్టమవుతుంది. ఫోర్డ్ ఇండియా గడచిన 18 ఏళ్లుగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈకోస్పోర్ట్ రాకతో ఈ 18 ఏళ్లలో కంపెనీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అత్యతధిక నెలవారీ అమ్మకాలను గడచిన జులై నెలలో నమోదు చేసింది.

ఓవైపు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అమ్మకాలు దూసుకుపోతుంటే, మరోవైపు రెనో డస్టర్ అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. జూన్ 2013లో 4,523 డస్టర్ అమ్మకాలను విక్రయించిన రెనో ఇండియా, జులై 2013 కేవలం 3,089 డస్టర్‌లను మాత్రమే విక్రయించింది. అంతుకు ముందు నెలతో పోల్చుకుంటే గడచిన నెలలో డస్టర్ అమ్మకాలు 31.7 శాతం తగ్గాయి. దీన్నిబట్టి చూస్తుంటే, డస్టర్‌ను కొనాలనుకున్న కార్ ప్రియులు కూడా మనసు మార్చుకొని ఈకోస్పోర్ట్‌ను కొంటున్నట్లు తెలుస్తోంది.

మొత్తమ్మీద చూసుకుంటే, అంతకు ముందు సంవత్సరం జులై నెలతో పోల్చుకుంటే, ఈ ఏడాది జులై నెలలో రెనో ఇండియా అమ్మకాలు మాత్రం రెండు రెట్లు పెరిగాయి. జులై 2012లో రెనో ఇండియా సేల్స్ 1,776 యూనిట్లుగా ఉండగా, జులై 2013లో రెనో ఇండియా సేల్స్ 3,763 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ మొత్తం అమ్మకాలలో ఎక్కువ భాగం డస్టర్ అమ్మకాలే ఉండటం విశేషం. ఇందులో 3089 డస్టర్ ఎస్‌యూవీలు, 371 స్కాలా సెడాన్లు, 292 పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు, 10 ఫ్లూయెన్స్ సెడాన్లు, 1 కొలియోస్ ఎస్‌యూవీలు ఉన్నాయి.

Renault Duster Sales

More from DriveSpark

Article Published On: Friday, August 2, 2013, 12:03 [IST]
English summary
Renault India on Thursday reported two- fold increase in sales in July at 3,763 units from 1,776 units in the same period of previous year. Despite challenging conditions in the automotive market, Renault India achieved sales of 3,763 units in July 2013, growing over two fold year on year, Renault India said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+