క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ దక్కించుకున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్

సాధారణంగా ఏ కారైనా ఈ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను తెచ్చుకుందంటే అది అన్ని విధాల సురక్షితమైన కారని, అందులో ప్రయాణికులకు పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని అర్థం. ఈ క్రాష్ టెస్ట్‌కు దాదాపుగా అన్ని భద్రతా ఫీచర్లు కలిగిన టాప్ ఎండ్ వేరియంట్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో తక్కువ రేటింగ్ వచ్చిన కార్లను భద్రత ఫీచర్ల పరంగా బలహీమైనవిగా పరిగణిస్తారు.
లాటిన్-ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ ఫలితాల ప్రకారం, ప్రమాదం జరిగినప్పుడు ఈ కారులో ప్రయాణించే ప్రయాణికుల శిరస్సు, మొండెం చక్కగా రక్షించబడుతాయని తేలింది. అయితే మోకాళ్ల రక్షణ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్లు గుర్తించారు. చైల్డ్ సేఫ్టీ విషయంలో కూడా ఇది మంచి రేటింగ్‌ను దక్కించుకుంది.
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో అందిస్తున్న ఎస్‌యూవీ డస్టర్ ఈ క్రాష్ టెస్ట్‌లో కేవలం 3-స్టార్ రేటింగ్‌ను సంపాధించుకుంది. అంటే, డస్టర్‌తో పోల్చుకుంటే ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీనే మరింత సురక్షితమైనదిగా చెప్పవచ్చు.
సాధారణంగా, ఈ క్రాష్ టెస్టుకు ఉపయోగించే కారును ఆటోమేటిక్‌గా నడిచేలా చేసి ఒక నిర్ధిష్ట వేగం వద్ద బలమైన ఇనుప దిమ్మెకు గుద్దుకునేలా చేసి, ఆ తర్వాత కారులో జరిగే పరిణామాలను అంచనా వేస్తారు. ఇందులో ప్రయాణికులకు సున్నితమైన బొమ్మలను ఉపయోగిస్తారు. బొమ్మలకు తగిలే దెబ్బలను బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తారు. ఎంత మేర రక్షణ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్‌లు సరైన సమయంలో విచ్చుకున్నాయా లేదా, సేఫ్టీ సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత స్టార్ రేటింగ్‌తో సర్టిఫై చేయటం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








