జూన్ 11, 2013న విడుదల కానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్

By Ravi

Ford EcoSport
ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌తో గత కొద్ది కాలంగా దేశీయ కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన ఫోర్డ్ ఇండియా వచ్చే నెలలో తమ కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా అప్‌డేట్ ప్రకారం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ జూన్ 11, 2013న విపణిలో విడుదల కావచ్చని తెలుస్తోంది. గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చిన ఈకోస్పోర్ట్ మరికొద్ది రోజుల్లో భారత రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.

ఇప్పటికే పలు ఫోర్డ్ ఇండియా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాల్లో ఈకోస్పోర్ట్ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత్‌లో మొత్తం నాలుగు వేరియంట్లలో (ఆంబీంటే, ట్రెండ్, టైటానియం, టైటానియం ఆప్షనల్) లభ్యం కానుంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. అందులో ఒకటి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, వేరొకటి 1.0 ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్. ఈకోబూస్ట్ ఇంజన్ కలిగిన వేరియంట్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, May 27, 2013, 13:13 [IST]
English summary
Ford could finally launch the EcoSport in India on June 11. Ford's long anticipated compact SUV unveiled in January 2012 has been in the limelight from the beginning of this year, with contests, promotional events and public showcases across the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+