నేపాల్ మార్కెట్లో విడుదైలన ఫోర్డ్ ఈకోస్పోర్ట్

By Ravi

ఏంటీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర 5.59 లక్షలే కదా, అచ్చు తప్పు టైప్ చేశారా అనుకోకండి. ఈ ధర మన ఇండియాలో కాదు, పొరుగు దేశమైన నేపాల్‌లో. ఫోర్డ్ ఇండియా ఇప్పుడు తమ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని నేపాల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. పూర్తిగా భారతదేశంలో తయారైన (మేడ్ ఇన్ ఇండియా) ఈకోస్పోర్ట్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో నేపాల్‌కు దిగమమతి చేసికొని, కంపెనీ అక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది.

రూపాయితో పోల్చుకుంటే నేపాల్ రూపీ కరెన్సీ విలువ చాలా తక్కువగా, దిగుమతి సుంఖం కూడా అధికంగా ఉండటంతో, అక్కడి మార్కెట్లో దీని ప్రారంభ ధర 28.50 లక్షల నేపాలీ రూపాయిలు (మనదేశ కరెన్సీలు ఈ విలువ 17.9 లక్షలు). నేపాల్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు ఇండియన్ వెర్షన్ ఈకోస్పోర్ట్‌కు ఎలాంటి వ్యత్యాసాలు లేవు. అక్కడి మార్కెట్లో కూడా ఇది 10 వేరియంట్లలో లభ్యం కానుంది. నేపాల్ మార్కెట్లో ఫోర్డ్ వాహనాలను అధీకృత డిస్ట్రిబ్యూటర్ అయిన గో ఫోర్డ్ ద్వారా ఈకోస్పోర్ట్ లభ్యం కానుంది.

Ford EcoSport Launched In Nepal

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విషయానికి వస్తే, ఇది మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 112 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది.

డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ గరిష్టంగా 91 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ఈకోస్పోర్ట్‌ మాత్రం 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, July 4, 2013, 16:09 [IST]
English summary
Made in India FordEcoSport launched in Nepal at a starting price of NPR 2,850,000 (around INR 17.9 lakh) The Ford EcoSport will be sold by Go Ford, the official distributor of Ford Vehicles in the Nepali market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+