ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీకి 60,000 లకు పైగా బుకింగ్స్
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా గడచిన జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మోడ్రన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు బారులు తీరుతున్నారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 విడుదలైనప్పుడు ఎలాగైతే ఉత్పత్తి సామర్థ్యానికి బుకింగ్స్ వచ్చాయో అలాగే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విషయంలో కూడా ఉత్పత్తికి మించి డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో వెయింటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోంది.

గతంలో అధిక డిమాండ్ కారణంగా, తమ పాపులర్ 1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ కలిగిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్ బుకింగ్‌లను కంపెనీ నిలిపివేసిన సంగతి తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం దాదాపు అన్ని రకాల ఈకోస్పోర్ట్ బుకింగ్‌లు కూడా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు 3 నుంచి 5 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. కాగా.. గడచిన జూన్ నెల నుంచి ఫోర్డ్ ఇండియా ఇప్పటి వరకు సుమారు 25,000 యూనిట్లకు పైగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను డెలివరీ చేసింది. అంటే, ఈ లెక్కన ఇంకా సుమారు 35,000 యూనిట్లకు పైగా పెండింగ్ ఆర్డర్లు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








