ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్‌కు సిగ్నల్
అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్‌కు చెందిన ఆస్ట్రేలియా విభాగం, ఫోర్డ్ ఆస్ట్రేలియా 'ఎవరెస్ట్' అనే అధునాతన కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. దీనిని స్థానికంగానే డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. ఆసియా మార్కెట్లలో (భారత్‌తో కలిపి) ఇది ఎండీవర్ అనే పేరుతో అమ్ముడుపోతుంది. తాజాగా ఆవిష్కరించిన ఎవరెస్ట్ కాన్సెప్ట్ వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి దశకు చేరుకోనుంది. భారత మార్కెట్లో కూడా ఇది విడుదల కానున్నట్లు సమాచారం.
ఫోర్డ్ ఆస్ట్రేలియా ప్రకటించిన అనేక వాహనాల్లో ఎవరెస్ట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ కూడా ఒకటి. ఫోర్డ్ ఆస్ట్రేలియాలో స్థానిక ఉత్పత్తిని 2016 నాటికి నిలిపివేస్తానని అమెరికన్ కార్ కంపెనీ ప్రకటించినప్పటికీ, ఇంపోర్టెండ్ ఉత్పత్తులను అందించడం ద్వారా తన ప్రస్థానాన్ని కొనసాగించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే, 2017 నాటికి 11 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నారు.

సరే ఇదంతా అటుంచి, ఎవరెస్ట్ కాన్సెప్ట్ (లేదా నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్) విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ విడుదల చసిన సమాచారం ప్రకారం, ఇందులో 2.2 లీటర్, 3.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. అలాగే ఇందులో 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను కూడా ఫోర్డ్ పరిచయం చేసే ఆస్కారం ఉంది.

ఫోర్డ్ ప్రస్తుత డిజైన్ ల్యాంగ్వేజ్‌ను ప్రతిభింభింప జేసే ట్రాపేజోయిడల్ క్రోమ్ గ్రిల్ (ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో చూసినట్లుగా) కనిపిస్తుంది. ఈ 2015 ఫోర్డ్ ఎండీవర్ భారత మార్కెట్లోని టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈ లోపుగా ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్ ఫొటోలను తిలకించండి.


Click it and Unblock the Notifications








