కార్ల ధరలను 5 శాతం మేర పెంచిన ఫోర్డ్ ఇండియా
బలహీన పడుతున్న రూపాయి విలువ, కార్ల తయారీదాలపై ప్రత్యేకించి విదేశీయ కంపెనీలపై తీవ్ర వత్తిడిని కలిగిస్తోంది. ఇప్పటికే, రూపాయి వంక నెపంతో కొన్ని కార్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచగా, మరికొన్ని కంపెనీలు త్వరలోనే ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
తాజాగా, అమెరికాకు చెందిన ఆటో దిగ్గజం ఫోర్డ్ ఇండియా కూడా భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ కార్ల ధరలను మోడల్‌ను బట్టి 1-5 శాతం మేర పెంచుతున్నట్లు పేర్కొంది. ఉత్పాదక వ్యయం పెరుగుతున్నందు వల్లనే ధరలను పెంచుతున్నామని కంపెనీ తెలిపింది. అయితే, ఏయే మోడల్‌పై ఎంత మేర పెంచుతున్నామనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
ఈ తాజా పెంపు సెప్టెంబర్ 5, 2013వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ఇంధన ధరలు, పతనమవుతున్న రూపాయి విలువ తదితర అంశాల కారణంగా ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగిపోయాయని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా వివరించారు.
భారత్‌లో ఫోర్డ్ అందిస్తున్న ఫిగో ధరలు రూ.3.91 లక్షల నుంచి రూ.6.08 లక్షల మధ్యలో ఉండగా, ఈకోస్పోర్ట్ ధరలు 5.59 లక్షల నుంచి రూ.9.37 లక్షల మధ్యలోను అలాగే ఫియస్టా సెడాన్ ధరలు రూ.7.46 లక్షల నుంచి రూ.10.30 లక్షల మధ్యలోను (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.



Click it and Unblock the Notifications








