మార్చి 4న ఈకోస్పోర్ట్‌కు బదులు స్పెషల్ ఎడిషన్ ఫిగో విడుదల

By Ravi

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదల మరోసారి వాయిదా పడింది. మార్చి 4, 2013న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయటం లేదని, ఆ రోజున స్పెషల్ ఎడిషన్ ఫిగోను మాత్రమే విడుదల చేస్తామని ఫోర్డ్ ఇండియా స్పష్టం చేసింది. ఫోర్డ్ ఇండియాగా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌కు మరిన్ని ప్రత్యేక ఫీచర్లను జోడించి, స్పెషల్ ఎడిషన్‌గా అందించనుంది.

ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న మొత్తం కార్లలో ఫోర్డ్ ఫిగో 80 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ చిన్న కారు ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి మూడేళ్లు పూర్తి కావస్తుండటంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫోర్డ్ ఫిగోలో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. న్యూఢిల్లీలో ఈ సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగోను విడుదల చేయనున్నారు.

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగోలో యాంత్రిక పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇదివరకటి వెర్షన్లలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్, 1.4 డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త వెర్షన్‌లోను ఉపయోగించనున్నారు. అయితే ఎక్స్టీరియర్స్ మరియు ఇంటీరియర్స్ లలో కొద్దిగా మార్పులు చేర్పులు ఉండనున్నాయి. కాగా.. ఎస్‌యూవీ ప్రియులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల గురించి మాత్రం కంపెనీ నోరు విప్పలేదు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఇది కూడా మార్చి నెలలో మార్కెట్లోకి రావచ్చని అంచనా. సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగోకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

New Ford Figo

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2013, 10:31 [IST]
English summary
The much awaited compact SUV Ford EcoSport launch postponed again. Ford India has cleared that, they will launch a special Edition Figo on March 4, 2013 not the EcoSport. The company will celebrate the third anniversary of the company's best selling hatchback Figo. To celebrate its success, the company has planned the launch of celebration edition of the Figo in New Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+