ఆకర్షనీయమైన ఆఫర్లతో ఫోర్డ్ ఇండియా 'మిడ్‌నైట్ సర్‌ప్రైజ్'
అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ ఇండియా, భారత మార్కెట్లో గడచిన కొద్ది సంవత్సరాలుగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ఒక రోజు 'మిడ్‌నైట్ సేల్స్' పేరిట షోరూమ్‌లను అర్థరాత్రి వరకు తెరచి ఉంచి, ఆ రోజున కారును కొనుగోలు చేసిన వారికి ఆకర్షనీయమైన కానుకలను, డిస్కౌంట్లను అందిస్తూ వస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. 2013 ఎడిషన్ మిడ్‌నైట్ సేల్స్‌ను డిసెంబర్ 5, 2013 నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఫోర్డ్ 'మిడ్‌నైట్ సర్‌ప్రైజ్' కంపెనీ నిర్వహించనున్న ఈ ప్రత్యేక క్యాంపైన్‌లో, డిసెంబర్ 5, 2013వ తేదీన కంపెనీ దేశవ్యాప్తంగా తమ షోరూమ్‌లను ఆర్థరాత్రి వరకూ తెరచి, ఆ ఒక్కరోజు మాత్రమే తమ కార్లపై భారీ తగ్గింపులను, ప్రోత్సాహకాలను ఆఫర్ చేయనుంది. ఆ రోజున ఉదయం 8 గంటల నుండి అర్థరాత్రి వరకూ తెరచి ఉంటాయని కంపెనీ తెలిపింది.

డిసెంబర్ 5న ఫోర్డ్ ఫిగో, క్లాసిక్, ఫియస్టా లేదా ఎండీవర్ కార్లను బుక్ చేసుకునే కస్టమర్లు ఎల్ఈడి టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు వంటి మరెన్నో అశ్శూర్డ్ గిఫ్ట్‌లను సొంతం చేసుకోవచ్చని ఫోర్డ్ ఇండియా పేర్కొంది. ఈ ఫోర్డ్ కార్లను బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఓ లక్కీ కూపన్ ఇవ్వటం జరుగుతుంది. కూపన్‌పై ఉండే విశిష్టమైన కోడ్‌ను ఎస్ఎమ్ఎస్ చేయటం ద్వారా సర్‌ప్రైజ్ బహుమతులను స్పాట్‌లోనే గెలుచుకోవచ్చని కంపెనీ వివరించింది.
ఆ రోజున ఫోర్డ్ కారును బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక తగ్గింపులతో పాటు, ఆకర్షనీయమైన వడ్డీ రేట్లు, రూ.3.5 కోట్ల వరకూ విలువైన అశ్శూర్డ్ బహుమతులు గెలుచుకునే అవకాశాలున్నాయని ఫోర్డ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. మరింకెందుకు ఆలస్యం, డిసెంబర్ 5, 2013 గురువారం రోజున ఫోర్డ్ షోరూమ్‌కి వెళ్లి మీ డ్రీమ్ కారును సొంతం చేసుకోవటమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి.


Click it and Unblock the Notifications








