ఫోర్డ్ ఇండియా నుంచి మరో చిన్న కారు వస్తోంది..

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో మరో చిన్న కారును విడుదల చేయనుంది. 2015 నాటికి ఎనిమిది కొత్త వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేయాలనే తమ వ్యూహంలో భాగంగా ఈ చిన్న కారును తయారు చేయనున్నామని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా తెలిపారు.

కాగా.. తమ చిన్న కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించాల్సిందిగా మీడియా ప్రతినిధులు ఆయనను కోరగా.. త్వరలోనే వెల్లడిస్తామని సమాధానమిచ్చారు. మాస్ సెగ్మెంట్ చాలా ముఖ్యమైనదని, భారత్‌లోని చిన్న కార్ సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా అందిస్తున్న చిన్న కారు 'ఫిగో' హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన ఫోర్డ్ తమ ఎంట్రీ లెవల్ కారును ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

Ford Small Car

భారత్ తమకు అత్యంత ముఖ్యమైన మార్కెటని, ఇక్కడ అన్ని సెగ్మెంట్లలలో వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని వినయ్ చెప్పారు. తమ ప్రణాళికలో భాగంగా, ఇప్పటికే నాలుగు కార్లను విడుదల చేశామని, త్వరోలోనే మరో నాలుగు కార్లను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

ఇకపోతే.. ఫోర్డ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఈకో‌స్పోర్ట్‌‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించడంతో, కంపెనీ మంచి మార్కెట్ వాటాను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ఎస్‌‌యూవీకి వెయిటింగ్‌ పీరియడ్ అధికంగా ఉంటోదని, దీనిని తగ్గించేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని వినయ్ వివరించారు. ప్రస్తుతం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కోసం 30,000 యూనిట్లకు పైగా పెండింగ్ బుకింగ్‌లు ఉండగా, నెలకు 4,000 యూనిట్ల నుంచి 6,000 యూనిట్లు వరకు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 4, 2013, 10:38 [IST]
English summary
US based auto major Ford India has said, it is looking at introducing a small car model in the country as part of its strategy to roll out eight new products by 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+