ఫోర్డ్ మస్టాంగ్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు ప్లాన్స్?

ఈ వార్త చదవగానే స్పోర్ట్ కార్ ప్రియులంతా వావ్ అనాల్సిందే. కండలు తిరిగిన ఫోర్డ్ మస్టాంగ్ (Ford Mustang) కారు ఇండియాకు వస్తుందా అంటే, అవుననే చెప్పాలి. ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లలో స్పోర్ట్స్ కార్ ప్రియులను అలరించిన ఫోర్డ్ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ కారు మస్టాంగ్ ఇకపై ఇండియాలో కూడా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఫోర్డ్ మస్టాంగ్ బ్రాండ్‌ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, వచ్చే ఈ ఏడాది ఈ కారును భారత్‌లో ప్రవేశపెట్టేందుకు అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఆన్‌లైన్ కథనం ప్రకారం, ప్రస్తుతం ఫోర్డ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ కలిగిన మస్టాంగ్ వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రత్యేకించి ఏషియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఈ కారును తయారు చేస్తున్నారు.

మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డిఫరెంట్ స్పోర్ట్స్ కార్

డిఫరెంట్ స్పోర్ట్స్ కార్

ఫోర్డ్ మస్టాంగ్ సాధారణ స్పోర్ట్స్ కార్ల కన్నా భిన్నంగా ఉంటుంది. హెవీగా కనిపించే ఈ కారు అంతే హెవీడ్యూటీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ధృడమైన నిర్మాణం దీని సొంతం. అందుకే ఈ కారును కండలు తిరిగిన కారు అని ముద్దుగా పిలుస్తుంటారు.

ఫోర్డ్ మస్టాంగ్ బాడీ స్టయిల్స్

ఫోర్డ్ మస్టాంగ్ బాడీ స్టయిల్స్

ఫోర్డ్ మస్టాంగ్ 2-డోర్ కూపే (2 మరియు 2+2 సీటింగ్), హ్యాచ్‌బ్యాక్, ఫాస్ట్‌బ్యాక్ మరియు కన్వర్టిబల్ బాడీ స్టయిల్స్‌లో లభిస్తుంది. స్టాండర్డ్ ఫోర్డ సెడాన్ సెడాన్ వేరియంట్ మస్టాంగ్ అస్సలు తయారే కాలేదు.

పవర్‌ఫుల్ ఇంజన్స్

పవర్‌ఫుల్ ఇంజన్స్

మస్టాంగ్ కూపే మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో (3.7 లీటర్ వి6, 5.0 లీటర్ మస్టాంగ్ జిటి, 5.8 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8) లభిస్తుంది.

తొలి మస్టాంగ్

తొలి మస్టాంగ్

మస్టాంగ్‌ను తొలిసారిగా ఏప్రిల్ 17, 1964లో న్యూయార్క్‌లో విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ డజన్ల కొద్దీ స్పెషల్ ఎడిషన్లు, మోడిఫైడ్ మస్టాంగ్‌లు చాలానే పుట్టుకొచ్చాయి.

స్పెషల్ ఎడిషన్ మస్టాంగ్

స్పెషల్ ఎడిషన్ మస్టాంగ్

వచ్చే ఏడాది ఈ బ్రాండ్ 50 వసంతాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో 2014 న్యూయార్క్ ఆటో షోలో ఫోర్డ్ మోటార్స్ ఓ స్పెషల్ ఎడిషన్ మస్టాంగ్‌ను విడుదల చేయనుంది.

మస్టాంగ్ ఇండియా ఎంట్రీ

మస్టాంగ్ ఇండియా ఎంట్రీ

ఫోర్డ్ మస్టాంగ్ ఇండియాకు వచ్చినట్లయితే, ఇక్కడి మార్కెట్లో కాంపాక్ట్ కార్లను విక్రయించే ఫోర్డ్ ఇండియా బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగే ఆస్కారం ఉంటుంది.

భారత్‌లో తొలి అమెరికన్ మజిల్ కారు

భారత్‌లో తొలి అమెరికన్ మజిల్ కారు

ఈ విషయంలో కంపెనీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక స్పందన లేదు. ఒకవేళ, ఇదే గనుక దేశీయ విపణిలో విడుదలైతే, భారత్‌లో తొలి అమెరికన్ మజిల్ కారుగా ఫోర్డ్ మస్టాంగ్ ఘనత దక్కించుకోనుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 6, 2013, 10:36 [IST]
English summary
In an AutocarIndia exclusive, the publication states, Ford is currently working on a right hand drive variant of the Mustang that will be later launched in appropriate markets such as the United Kingdom and Australia. India is also reportedly in the automaker's radar, but it is still studying the feasibility of launching a sports car such as the Mustang in a conservative market such as ours.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+