1.66 లక్షల ఫిగో, క్లాసిక్ కార్లను రీకాల్ చేసిన ఫోర్డ్
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా, తాజాగా భారత్‌లో మరొక రీకాల్‌ను జారీ చేసింది. కంపెనీ దేశీయ విపణిలో విక్రయిస్తున్న చిన్న కారు ఫోర్డ్ ఫిగో, చవక సెడాన్ ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ కార్లలో సమస్యల కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ రీకాల్‌లో మొత్తం 1,66,000 ఫిగో హ్యాచ్‌బ్యాక్, క్లాసిక్ సెడాన్ కార్లు ఉన్నాయి.
కాగా.. ఈ తాజా రీకాల్ గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో కంపెనీ రీకాల్ చేసిన 1,25,000 కార్లకు అదనం కావటం గమనార్హం. ఆ సమయంలో వెనుక సస్పెషన్‌లోని రియర్ ట్విస్ట్ బీమ్ (ఆర్‌టిబి), పవర్ స్టీరింగ్ హోస్ (పిఏఎస్) సంబంధిత సమస్యల కారణంగా కంపెనీ ఈ కార్లను రీకాల్ చేసింది. తాజా రీకాల్ విషయంలో కూడా ఇదే సమస్య వల్లనే ఫిగో, క్లాసిక్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
జనవరి 2011 నుంచి జూన్ 2012 మధ్య కాలంలో విక్రయించిన 1,09,469 ఫిగో కార్లు, 22,453 క్లాసిక్ కార్లలో రియర్ ట్విస్ట్ బీమ్ సమస్యను, అలాగే 30,681 ఫిగో కార్లు, 3,418 క్లాసిక్ కార్లలో పవర్ స్టీరింగ్ హోస్ సమస్యను తనిఖీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. కస్టమర్ల భధ్రత, సంతృప్తి మేరకు ఈ రీకాల్ జారీ చేస్తున్నమని, ఈ రీకాల్ పరిధిలోనికి వచ్చే కార్లను తనిఖీ చేసి, లోపపూరితమైన భాగాలను కొత్త వాటితో రీప్లేస్ చేస్తామని కంపెనీ వివరించింది.



Click it and Unblock the Notifications








