ఈకోస్పోర్ట్ సక్సెస్: భారత్‌లో ఫోర్డ్ ఇండియా సేల్స్ రికార్డ్

By Ravi

భారత మార్కెట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదలతో, అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా దశ తిరిగింది. ఇటీవలే దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. గడచిన నెలలో ఫోర్డ్ ఇండియా చరిత్రలోనే ఇదివరకెన్నడూ లేని విధంగా 14,217 యూనిట్ల కార్లు అమ్ముడుపోయాయి (ఎగుమతులతో కలిపి).

సవాళ్లతో కూడిన మార్కెట్ వాతావరణంలో సైతం ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 2013 నెల అమ్మకాలు ప్రోత్సాహకర వృద్ధిని కనబరచాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే, కంపెనీ అమ్మకాలు ఏకంగా 51 శాతం పెరిగాయి. అమ్మకాలు ఈ స్థాయిలో వృద్ధి సాధించడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి.

ఇందులో ఫోర్డ్ ఇండియా దేశీయ అమ్మకాలు 37 శాతం వృద్ధి చెంది 7,794 యూనిట్ల నుంచి 10,640 యూనిట్లకు పెరిగాయి. అలాగే ఎగుమతులు 3,577 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ అమ్మకాలు ఇంత రికార్డు స్థాయిలో పెరగటానికి కారణం కంపెనీ అందిస్తున్న ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీనే.

Ford EcoSport

More from DriveSpark

Article Published On: Thursday, October 3, 2013, 11:07 [IST]
English summary
Ford India sold 14,217 cars in combined domestic wholesales and exports, the best month in its history, despite increasingly challenging market conditions. Ford India's September sales were up 51 percent compared to the same month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+