ఫోర్డ్ ఈకోస్పోర్ట్: భారత్ కన్నా ముందు చైనాలో విడుదల

By Ravi

Ford EcoSport
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ నుంచి రానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' విడుదల కోసం ఓ వైపు భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, ఈ కాంపాక్ట్ కారును మన దేశం కంటే ముందుగా చైనాలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. కార్ న్యూస్ చైనా తెలిపిన సమాచారం ప్రకారం, ఫోర్డ్ మోటార్స్ తమ గ్లోబల్ మోడల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈకోస్పోర్ట్‌ను ఈనెల 19న చైనా మార్కెట్లో విడుదల చేయనుంది.

చైనా మార్కెట్లో డీజిల్ కన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నందున, అక్కడి మార్కెట్లో విడుదల కానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ రెండు విభిన్న పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరొకటి, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. అయితే, 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్‌లో మాత్రం 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ పవర్‌షిఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్సిమిన్ (గేర్ బాక్సు)ను అందుబాటులో ఉంచారు.

ఇకపోతే డీజిల్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. చైనా మార్కెట్లో జనరల్ మోటార్స్ నుంచి ఫోర్డ్ మోటార్స్ గట్టి పోటీని ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకురావటం ద్వారా అక్కడి మార్కెట్లో తమ వాటా పెంచుకోవాలని ఫోర్డ్ యోచిస్తోంది. చైనా మార్కెట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర 94,800 యువాన్‌ల నుంచి 1,29,800 యువాన్‌ల మధ్యలో ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదల కోసం మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 12, 2013, 14:31 [IST]
English summary
Ford EcoSport, the much awaited compact SUV from Ford Motors is all set to hit the China roads before Indian launch. The American auto major has said to launch the vehicle in China on March 19, 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+