ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్లు, ధరలు
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ధరల యుద్ధాని తెరలేపుతూ కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధరకే అమెరికన్ ఆటో దిగ్గజం తమ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. నేటి నుంచే ఈ కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన రీతిలో ఈకోస్పోర్ట్‌ను మార్చుకునేందుకు డీలర్‌షిప్‌ల వద్ద 38 యాక్ససరీలు అందుబాటులో ఉన్నాయి.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం 10 వేరియంట్లలో లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
1. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.5.59 లక్షలు
2. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.6.49 లక్షలు
3. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.7.51 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్):
4. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఏటి టైటానియం - రూ.8.45 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
5. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం - రూ.7.89 లక్షలు
6. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.8.29 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
7. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.6.69 లక్షలు
8. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.7.61 లక్షలు
9. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.8.62 లక్షలు
10. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.8.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)



Click it and Unblock the Notifications








