గార్మిన్ నుంచి నాలుగు కొత్త నావిగేషన్ డివైజ్‌ల విడుదల
శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్స్ తయారీలో పేరొందిన గార్మిన్ సంస్థ కొత్త శ్రేణి నావిగేషన్ పరికరాలను దేశీయ విపణిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. గడచిన సంవత్సరం జూన్ నెలలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన గార్మిన్ తాజాగా నాలుగు కొత్త నావిగేషన్ సిస్టమ్‌లను విడుదల చేసింది. అవి: నువి 42ఎల్ఎమ్, నువి 52ఎల్ఎమ్, నువి 2460 ఎల్ఎమ్ మరియు నువి 2568 ఎల్ఎమ్. దేశీయ విపణిలో వీటి ధర వివరాలు ఇలా ఉన్నాయి:
- గార్మిన్ నువి 42ఎల్ఎమ్ - రూ.8,990/-
- గార్మిన్ నువి 52ఎల్ఎమ్ - రూ.9,990/-
- గార్మిన్ నువి 2460 ఎల్ఎమ్ - రూ.13,990/-
- గార్మిన్ నువి 2568 ఎల్ఎమ్ - రూ.16,990/-
ఈ కొత్త శ్రేణి గార్మిన్ నావిగేషన్ సిస్టమ్‌లలో గైడెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఫీచరును జోడించారు. ఈ ఫీచర్ వలన డెస్టినేషన్ సెర్చ్ మరింత సులువు అవుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఇందులో జోడించిన ఫొటో రియల్ జంక్షన్ వ్యూ సాయంతో సంబంధిత జంక్షన్‌ను సమీపించినప్పుడు సదరు జంక్షన్ యొక్క వాస్తవిక పిక్చర్‌ను ఇది స్క్రీన్‌పై చూపిస్తుందని, ఇంకా చారిత్రాత్మక ప్రదేశాలు, టూరిస్ట్ ప్రదేశాలు మొదలైన వాటి గురించి సమాచారం ఇస్తుందని కంపెనీ తెలిపింది.

వీటిల్లో లేన్ అసిస్ట్, అడ్వాన్స్‌డ్ హైవే మోడ్, టెక్స్ట్-టూ-స్పీచ్ మరియు వాయిస్ గైడెన్స్ (హిందీ, ఆంగ్లం) వంటి ఫీచర్లున్నాయి. రెస్టారెంట్లకు సంబంధించి సమాచారాన్ని అందజేసేందుకు జొమాటో డాట్‌కామ్‌తో కూడా గార్మిన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నావిగేషన్ పరికరాల విడుదలతో ప్రజలు నావిగేషన్‌లో ప్రపంచ-స్థాయి అనుభూతిని పొందుతారని గార్మిన్ కార్పోరేషన్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) టోనీ యాన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








