తవేరా రీకాల్: ఉద్యోగులపై వేటు వేసిన జనరల్ మోటార్స్
జనరల్ మోటార్స్ ఇండియా 2005వ సంవత్సరం నుంచి 2013వ సంవత్సర మధ్య కాలంలో దేశీయ విపణిలో విక్రయించిన, సుమారు లక్ష యూనిట్లకు పైగా చెవర్లే తవేరా వాహనాలను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, చవర్లే తవేరా కాలుష్య నిబంధనల అంశంలో కంపెనీ పాలసీని ఉల్లంఘించినందుకే ఈ సమస్య ఏర్పడిందని, ఇందుకు పాల్పడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం.
దీనిపై స్పందించేందుకు కంపెనీ అధికారులు మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కంపెనీ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 25 మంది ఉద్యోగులను కంపెనీ విధుల నుంచి బహిష్కరించినట్లు సమాచారం.
చెవర్లే ఎమ్‌పివిలలో ఎమిషన్స్, స్పెసిఫికేషన్ సమస్యలకు సంబంధించి జనరల్ మోటార్స్ ఈ రీకాల్‌ను జారీ చేసింది. భారతదేశంలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు చేసిన అతిపెద్ద రీకాల్‌లలో చెవర్లే తవేరా రీకాల్ కూడా ఒకటి కావటంతో కంపెనీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సమస్యల కారణంగా జనరల్ మోటార్స్ ఇప్పటికే తవేరా ఉత్పత్తి నిలిపి వేసింది. తవేరా భారత్ స్టేజ్ 3 (2.5 లీటర్ వేరియంట్)లో ఎమిషన్ (కాలుష్య) సమస్యలు, తవేరా బిఎస్ 4 (2.0 లీటర్ వేరియంట్)లో స్పెసిఫికేషన్ సమస్యలు ఉన్నట్లు జనరల్ మోటార్స్ వివరించింది.
జనరల్ మోటార్స్ ఇండియాకు దేశవ్యాప్తంగా 280 డీలర్ల ద్వారా రీకాల్ చేసిన వాహనాల్లో లోపపూరిత భాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తామని, ఈ విషయానికి సంబంధించి కస్టమర్లకు ఎలా, ఎప్పుడు తమ వాహనాలను సర్వీస్‌కు తీసుకురావాలోననేది ప్రత్యేకంగా తెలియజేస్తామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








