చెవర్లే తవేరా ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన జిఎమ్ ఇండియా

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయించిన చెవర్లే తవేరా మోడళ్లలో కాలుష్య నిబంధనల సమస్యల వలన 1.14 లక్షల తవేరా ఎమ్‌పివిలను రీకాల్ చేసి, తాత్కాలికంగా ఈ మోడల్ ఉత్పత్తిని కూడా నిలిపివేసిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ విషయంలో తాజా అప్‌డేట్ ప్రకారం, కంపెనీ చెవర్లే తవేరా ఎమ్‌పివిని ఉత్పత్తిని పునఃప్రారంభించింది.

చెవర్లే తవేరా కాలుష్య నిబంధనల విషయంలో, నియంత్రణ అనుమతులు అందుకున్న తర్వాత దీని ఉత్పత్తిని తిరిగి ప్రారంభించామని కంపెనీ అధికారు ఒకరు వెల్లడించారు. గడచిన జులై 2013 నెలలో జనరల్ మోటార్స్ తవేరా ఎమ్‌పివి విషయంలో ఎమిషన్ స్టాండర్డ్స్, ఇతర రెగ్యులెటరీ స్పెసిఫికేషన్ సమస్యల వలన 1,14,000 తవేరాలను రీకాల్ చేయటమే కాకుండా, భారత్‌లో బిఎస్3, బిఎస్4 వెర్షన్ మోడళ్ల ఉత్పత్తిని కూడా నిలిపి వేసింది.

Tavera MPV

జనరల్ మోటార్స్ ఇండియాకు 7,8,9, 10 సీటర్స్ టైప్ బిఎస్3 వెర్షన్ తవేరా మోడళ్ల ఉత్పత్తి అనుమతి లభించిందని, వీటి ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు. బిఎస్4 వెర్షన్ అప్రూవల్ మాత్రం ప్రస్తుతం తుది దశలో ఉందని, ఏ క్షణంలోనైనా దీనికి అనుమతి లభించవచ్చని, ఆ వెంటనే ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుందని ఆయన వివరించారు.

More from DriveSpark

Article Published On: Monday, October 21, 2013, 12:12 [IST]
English summary
US auto major General Motors has restarted the production of its Tavera MPV in India after receiving regulatory approvals, a company executive said. In July company has recalled 1.14 lakh Tavera MPVs due to emission related issues.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+