హ్యుందాయ్ ఐ10 ఎరా వేరియంట్‌పై రూ.50,000 డిస్కౌంట్
గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాల జోరు తగ్గడంతో ప్రముఖ కార్ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా, భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఐ10 కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా 'జాయ్‌ఫుల్ జులై' ఓ సరికొత్త క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపైన్‌లో భాగంగా జులై నెలలో హ్యుందాయ్ ఐ10 కారును కొనగోలు చేసే కొనుగోలుదారులు ఎరా వేరియంట్‌పై రూ.50,000 భారీ తగ్గింపును పొందవచ్చు. హ్యుందాయ్ ఐ10 ఎరా వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ఇది వరకు రూ.4,09,465 ఉండగా, కంపెనీ ఇప్పుడు రూ.3,59,990 లకే ఈ వేరియంట్‌ను విక్రయిస్తోంది.
ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని కంపెనీ పేర్కొంది మరి ఆలస్యమెందుకు వెంటనే మీ బుజ్జి ఐ10 కారును నేడే ఇంటికి తెచ్చుకోండి. ఇదిలా ఉండగా, హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20పై కూడా కంపెనీ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసినదే. జూలై నెలలో ఐ20 కారు కొన్నవారికి, పూర్తి ఖర్చులు చెల్లించే ప్యాకేజీతో కూడుకున్న సింగపూర్ హాలిడే ట్రిప్‌ను గెలుచుకునే అవకాశాన్ని హ్యుందాయ్ అందిస్తోందియ. ఈ ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత హ్యుందాయ్ డీలరును సంప్రదించండి.



Click it and Unblock the Notifications








