మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌పై రూ.62,000 సేవింగ్స్!

By Ravi

గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, దాదాపు అన్ని ప్రముఖ కార్ల కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను, ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి.

తాజాగా, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అందిస్తున్న పెట్రోల్ కారు 'వ్యాగన్ఆర్'పై రూ.62,000 విలువైన ప్రోత్సాహకాలను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ బ్రేకప్ క్రింది విధంగా ఉంది.

  • కన్జ్యూమర్ ఆఫర్ - రూ.36,000 (ఎమ్‌జిఏ కాంబో రూ.24,200, గిఫ్ట్ చెక్ రూ.11,800)
  • ఎక్సేంజ్ బోనస్ - రూ.20,000
  • కార్పోరేట్ ఆఫర్ - రూ.6,000

వ్యాగన్ఆర్ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత మారుతి సుజుకి డీలరును సంప్రదించండి.

WagonR Offer

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్, సిఎన్జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.6 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఉపయోగించిన 1.0 లీటర్, 3-సిలిండర్ కెబి10 కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ విపణిలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రారంభ ధర రూ.3.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 30, 2013, 10:17 [IST]
English summary
The Maruti Suzuki WagonR is now available at a hefty discount of 62,000 rupees. This offer is applicable on all versions of the WagonR except the VXi and VXi ABS variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+