జనరల్ మోటార్స్ నుంచి 24x7 ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్
జనరల్ మోటార్స్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త సంవత్సరంలో కారు కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ ఓ ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. జనవరి 2014 నుంచి షెవర్లే వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను అందిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తమ విలువైన వినియోగదారుల యొక్క వాహన యాజమాన్య అనుభూతిని మరింత విస్తరించడంతో పాటుగా, భారతదేశంలోని రోడ్లపై ప్రయాణిస్తుప్పుడు ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినా, వాహనంలో సమస్యలు తలెత్తినా జనరల్ మోటార్స్ ఉండియా ఉచితంగా తమ వినియోగదారులకు సేవలను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
తమ వ్యాపారంలో వినియోగదారుడు అత్యంత కీలకం అని, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ప్రారంభంతో ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరో అడుగు ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ ప్రణాళికలో భాగంగా తమ కస్టమర్లకు, వెహికల్ ఇమ్మొబిలైజేషన్ సందర్భంలో ఉచిత టాక్సీ, వెహికల్ టోయింగ్ వంటి సేవలను ప్రత్యేక శ్రద్ధతో అందిస్తామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు.

మెకానికల్ లేదా ఎలక్ట్రిక్ బ్రేక్‌డౌన్ వలన వెహికల్ ఇమ్మొబిలైజేషన్‌కు గురైనా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, బ్యాటరీ ఖాలీ కావటం, ఇందనం లీక్ అవ్వటం, టైర్ సంబంధిత సమస్యలు మరియు తాళం లాక్ కావటం లేదా పోగొట్టుకుపోవటం వంటి సమస్యలకు షెవర్లే 24x7 ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ తక్షణ మద్దతునిస్తుంది.
బ్రేక్‌డౌన్ లేదా యాక్సిడెంట్ సందర్బంలో షెవర్లే యజమానులు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం 1800-103-8090 (టోల్-ఫ్రీ) లేదా 0124-4388090 నెంబర్లపై ఫోన్ చేయవచ్చు. ప్రస్తుత షెవర్లే యజమానులు కూడా ఈ తరహా సౌకర్యాన్ని పొందవచ్చు. అయితే, ఇందుకు ఏడాదికి గాను రూ.1,000లు మరియు మూడేళ్లకు గాను రూ.2,700లు చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








