భారత్‌లో లక్షకు పైగా చెవర్లే తవేరా వాహనాలు వెనక్కి!

By Ravi

Chevrolet Tavera Recall
జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయించిన, సుమారు లక్ష యూనిట్ల చెవర్లే తవేరా వాహనాలను రీకాల్ చేసింది. 2005వ సంవత్సరం నుంచి 2013వ సంవత్సర మధ్య కాలంలో ఉత్పత్తి చెవర్లే ఎమ్‌పివిలలో ఎమిషన్స్, స్పెసిఫికేషన్ సమస్యలకు సంబంధించి ఈ రీకాల్‌ను జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. భారతదేశంలో వివిధ కంపెనీలు అతిపెద్ద రీకాల్‌ లలోతాజా రీకాల్ కూడా ఒకటి.ట

ఈ సమస్యల కారణంగా ఇప్పటికే ఈ మోడల్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సమస్యలు వాహన సేఫ్టీకి సంబంధించినవి కావని, కాలుష్య నిబంధనలకు సంబంధించినవని కంపెనీ తెలిపింది. గడచిన ఏడాది కాలంలో వివిధ వాహన కంపెనీలు ఇలా రీకాల్‌ను ప్రకటించడం ఇది 9వ సారి. తవేరా భారత్ స్టేజ్ 3 (2.5 లీటర్ వేరియంట్)లో ఎమిషన్ (కాలుష్య) సమస్యలు, తవేరా బిఎస్ 4 (2.0 లీటర్ వేరియంట్)లో స్పెసిఫికేషన్ సమస్యలు ఉన్నట్లు జనరల్ మోటార్స్ వివరించింది.

జనరల్ మోటార్స్ ఇండియాకు దేశవ్యాప్తంగా 280 డీలర్ల ద్వారా రీకాల్ చేసిన వాహనాల్లో లోపపూరిత భాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తామని, ఈ విషయానికి సంబంధించి కస్టమర్లకు ఎలా, ఎప్పుడు తమ వాహనాలను సర్వీస్‌కు తీసుకురావాలోననేది ప్రత్యేకంగా తెలియజేస్తామని కంపెనీ పేర్కొంది. చెవర్లే తవేరా ఎమ్‌పివిని ఎక్కువగా పెద్ద కుటుంబాలు కలిగిన కలిగి వారు అలాగే టాక్సీ, టూరింగ్ వాహనాల ప్రయోజనం కోసం వినియోగించుకునే వారు కొనుగోలు చేస్తుంటారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 25, 2013, 11:27 [IST]
English summary
The Tavera MPV, diesel Sail and the Sail U-VA. These were three models General Motors India stopped producing in June. While it became known that the production was halted due to irregularities with vehicle emission, the true extent of the problem became only yesterday afternoon when GM India issued a voluntary recall of 1.14 lakhs units of Tavera MPV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+