సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్ ధరలు తగ్గించిన చెవర్లే
దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతి సుజుకి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో వంటి కార్లను సవాల్ చేయటానికి వచ్చిన చతికల పడిన చెవర్లే సెయిల్ యువా (Chevrolet Sail U-VA) ధరలను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగపోవటంతో పాటుగా గడచిన సంవత్సరానికి చెందిన స్టాక్ కూడా అధికంగా ఉండటంతో సెయిల్ యువా ధరను తగ్గిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
జనరల్ మోటార్స్ తమ మేడ్ ఇన్ ఇండియా చెవర్లే సెయిల్ నవంబర్ 2, 2012న రూ.4.44 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు 2013 మోల్ చెవర్లే సెయిల్ యువా ప్రారంభ రూ. 4.19 లక్షలకు దిగొచ్చింది. అంతేకాకుండా, ఈ సంవత్సరంలో ఉత్పత్తి అయిన మోడళ్లపై కార్పోరేట్లకు రూ. 3,000 అదనపు తగ్గింపును కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
అలాగే, 2012 మోడల్ చెవర్లే సెయిల్ యువా (పెట్రోల్, డీజిల్ వెర్షన్ల)పై కంపెనీ రూ రూ.25,000 తగ్గింపును అందిస్తుండటంతో, ఆ సంవత్సరానికి చెందిన బేస్ వేరియంట్ (1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్) ధర రూ.3.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు దిగొచ్చింది. నవంబర్ 2012 నెలలో 1595 యూనిట్లు అమ్ముడుపోయిన సెయిల్ యువా, ఫిబ్రవరి 2013లో కేవలం 560 యూనిట్లు మాత్రమే అమ్మడుపోయాయి. ఈ నేపథ్యంలో, ఈ మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఈ తగ్గింపును అందిస్తోంది.

ఇక చెవర్లే సెయిల్ యువా విషయానికి వస్తే, ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో మొత్తం ఏడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. పెట్రోల్ వెర్షన్ సెయిల్ యువా లీటరుకు 18.2 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ సెయిల్ యువా లీటరుకు 22.1 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








