ఎస్‌యూవీల గ్రౌండ్ క్లియరెన్స్ రూల్‌ను మార్చనున్న సర్కార్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో భారత సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 170 మి.మీ. కన్నా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఎస్‌యూవీలపై 30 శాతం ఎక్సైజ్ సుంఖాన్ని వసూలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసినదే. దీంతో మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీపై పడే అధిక భారాన్ని తగ్గించుకునేందుకు దీని గ్రౌండ్ క్లియరెన్స్‌ను 200మ మి.మీ. నుంచి 170 మి.మీ. లకు తగ్గించింది.
ఇందుకోసం పెద్దగా కష్టపడకుండా, కారు అడుభాగంలో స్టోన్ గార్డ్‌ను జోడించి గ్రౌండ్ క్లియరెన్స్‌ను తగ్గించింది. దీని వలన ఈ మోడల్‌ను రీడిజైన్ చేయాల్సిన అవసరం లేకుండానే గ్రౌండ్ క్లియరెన్స్‌ను తగ్గించినట్లయింది. ఫలితంగా కంపెనీకు భారీ మొత్తంలో నగదు ఆదా అయ్యింది. అంతేకాకుండా, ఇలా గ్రౌండ్ క్లియరెన్స్‌ను తగ్గించడం వలన ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీపై ఎక్సైజ్ సుంఖం తగ్గడంతో దీని ధర కూడా సుమారు రూ.30,000 వరకు తగ్గింది.

గ్రౌండ్ క్లియరెన్స్ మహీంద్రా అనుసరించిన విధానాన్ని పరిశీలించిన ప్రభుత్వాధికారులు, ఈ నిబంధనను ఎలా అమలుపరచాలనే అంశంపై పునరాలోచన చేయనున్నారు. ప్రస్తుత నిబంధన ప్రకారం, కారు అడుభాగం నుంచి నేలకు మధ్యకు ఉండే ఎత్తును గ్రౌండ్ క్లియరెన్స్‌గా లెక్కించడం జరుగుతుంది. మహీంద్రా తీరును గమనించిన అధికారులు కొత్త నిబంధన అమల్లోకి తీసుకు వస్తే, కారు క్రింది భాగంలో జోడించే ఎలాంటి ప్యానెల్స్/గార్డ్స్‌ను పరిగణలోకి తీసుకోకుండా, వాస్తవిక గ్రౌండ్ క్లియరెన్స్‌ను లెక్కించడం జరుగుతుంది.
ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీపై తిరిగి 30 శాతం ఎక్సైజ్ సుంఖం వర్తిస్తుంది. ఈ అంశంపై మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ డివిజన్) పవన్ గోయెంకా మాట్లాడుతూ.. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే, తాము తమ కార్లలో మార్పులు చేయలేమని, ఎస్‌యూవీ టాక్స్‌ను అంగీకరించక తప్పదని అన్నారు.


Click it and Unblock the Notifications








