ప్రపంచపు ఉత్తమ టాక్సీగా ఎంపికైన 'అంబాసిడర్' కారు

By Ravi

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాట అక్షరాల నిజం. ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రపంచంలో అనేక ఆధునిక టెక్నాలజీ, మోడ్రన్ డిజైన్‌తో కూడిన టాక్సీలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, పురాతన భారతీయ ఆటోమొబైల్ హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్‌ను మరపించలేకపోయాయి. ప్రపంచ ఉత్తమ ట్యాక్సీగా అంబాసిడర్ కారు ఎంపికైందంటే, ఈ టాక్సీకి ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

బిబిసికి చెందిన టాప్‌ గేర్ ప్రోగ్రామ్ నిర్వహించిన వరల్డ్ టాక్సీ షూటవుట్ ఓటింగ్‌లో అంబాసిడర్‌కు ఈ ఖ్యాతి లభించింది. ఈ వరల్డ్ టాక్సీ షూటవుట్ ఓటింగ్‌లో బ్రిటన్, అమెరికా, జర్మనీ, దక్షిణాఫ్రికా, మెక్సికో, రష్యాల్లోని టాక్సీ కార్లన్నింటిని అధిగమించి హిందూస్తాన్ మోటార్స్‌కు చెందిన అంబాసిడర్ టాక్సీ అగ్రస్థానాన్ని దక్కించుకోవటం విశేషం.

అంబాసిడర్ తొలుత బ్రిటన్‌లో మోరిస్ ఆక్స్‌ఫర్డ్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ తర్వాత అంబాసిడర్‌గా పేరు మార్చుకొని భారత ఆటోమొబైల్/టాక్సీ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొని, కొన్ని దశాబ్ధాల పాటు ప్రజలకు సేవలందించింది. సి.కె.బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందూస్తాన్ మోటార్స్ 1948లో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉత్తరపరలో అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది.

Ambassador

అప్పట్లో అంబాసిడర్ కారు ఓ స్టేటస్ సింబల్‌గా ఉండేది. ఈరోజుల్లో బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్లు ఎలాగో అప్పట్లో అంబాసిడర్ అలాగ. ఇప్పటికీ అనేక మంది ప్రభుత్వాధికారులు, టాక్సీ ఓనర్లు అంబాసిడర్ కారుకే ప్రధాన్యత ఇస్తుంటారు.

అయితే, ప్రస్తుతం మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా, టొయోటా వంటి కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీ, సౌకర్యవంతమైన ఫీచర్లతో కార్లను అందుబాటులోకి తీసుకువస్తుండటంతో అంబాసిడర్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో హిందుస్థాన్ మోటార్స్ మొత్తం 3,390 అంబాసిడర్ కార్లను విక్రయించగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో కేవలం 709 అంబాసిడర్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏదేమైనప్పటికీ, అంబాసిడర్ కారుకు ఈ ఖ్యాతి లభించడం చెప్పుకోదగిన విషయం.

More from DriveSpark

Article Published On: Monday, July 22, 2013, 11:50 [IST]
English summary
It may have lost out to the more modern competitors from Maruti Suzuki, Hyundai, Toyota and Honda but the good old Ambassador car, which once ruled the roost in India, has just been voted as the world's best taxi by global automotive programme Top Gear.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+