కొత్త ఇంజన్, కొత్త పేరుతో రానున్న సరికొత్త అంబాసిడర్!

ఈ నేపథ్యంలో, ఆధునిక కాలుష్య నిబంధనలకు లోబడి అభివృద్ధి చేసిన సరికొత్త 1.5 లీటర్ బిఎస్-4 (భారత్ స్టేజ్ 4) ఇంజన్‌తో కూడిన సరికొత్త అంబాసిడర్ కారును కొత్త పేరుతో కంపెనీ విడుదల చేయనుంది. ఈ కొత్త వేరియంట్‌ను ఇప్పటికే కొంత మంది క్యాబ్ డ్రైవర్లు, హెచ్ఎమ్ డీలర్లకు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న తమ ఉత్తర్‌పరా ఫ్యాక్టరీలో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. అందులో కొందరు ఫ్యాక్టరీ టెస్ట్ ట్రాక్‌పై ఈ కారును టెస్ట్ చేశారు. ఇది తమ ఫీడ్‌బ్యాక్‌కు తగినట్లుగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు, డీలర్లు చెప్పారని కంపెనీ పేర్కొంది.
అంతకు మించిన సమాచారాన్ని, ఇంజన్ స్పెసిఫికేషన్లను, విడుదల తేది మరియు ధర తదితర విషయాల గురించి కంపెనీ వెల్లడించలేదు. ఈ కొత్త బిఎస్-4 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడిన సరికొత్త అంబాసిడర్ జూన్ నెలాఖరు నాటికి మార్కెట్లోకి రావచ్చని గతంలో కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త అంబాసిడర్ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








