భారత్‌లో హోండా అకార్డ్ ఉత్పత్తి బంద్; ఫేస్‌లిఫ్ట్ వస్తుందా?

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ హోండా అకార్డ్ (Honda Accord) ఇకపై డీలర్ల వద్ద కనిపించబోదు. ఓ ఆంగ్ల పత్రిక పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ మోడల్ అమ్మకాలు సజావుగా సాగకపోవటంతో, హోండా తమ అకార్డ్ సెడాన్‌ను భారత మార్కెట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్‌ను ఉటంకిస్తూ, ఎకనామిక్ టైమ్స్ ఈ వార్తను ప్రచురించింది. అయితే, ప్రస్తుత హోండా అకార్డ్ మార్కెట్ నుంచి తొలగిపోయినప్పటికీ, త్వరలోనే సరికొత్త అకార్డ్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. కానీ, ఇందుకు సంబంధించిన టైమ్ ఫ్రేమ్‌ను మాత్రం ఆయన వెల్లడించలేదు.

Honda Accord

హోండా 2008వ సంవత్సరంలో తమ హోండా అకార్డ్ లగ్జరీ సెడాన్‌ను తొలిసారిగా భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, హోండా అకార్డ్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కావటం, దీని ధర కూడా అధికంగా ఉండటంతో, ఈ మోడల్‌ను కొనుగోలు చేసే వారి సంఖ్య నానాటికీ తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో డీజిల్ కార్లకు మంచి గిరాకీ ఉండటంతో, డీజిల్ కార్ల ఉత్పత్తిపై దృష్టి సారించిన హోండా, తమ అకార్డ్‌లో కూడా డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న హోండా అకార్డ్ 2.4 లీటర్ ఇంజన్, 3.5 లీటర్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2.4 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180 పిఎస్‌ల శక్తిని, 225 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 3.5 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 275 పిఎస్‌ల శక్తిని, 339 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, December 23, 2013, 10:11 [IST]
English summary
According to a report on Economic Times, Honda Cars India have discontinued their flagship luxury sedan, the Accord, in the Indian market. The model has been phased out owing to poor demand.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+