చెన్నై మార్కెట్లో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ విడుదల

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజర్ కాంపాక్ట్ సెడాన్‌ను సవాల్ చేస్తూ హోండా కార్స్ ఇండియా ప్రవేశపెట్టి హోండా అమేజ్‌‌ను కంపెనీ ఇప్పుడు చెన్నై మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. చెన్నై మార్కెట్లో హోండా అమేజ్ ప్రారంభ ధర రూ.5.04 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై)గా ఉంది. హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లబిస్తుంది. ఇది హోండాకు మొట్టమొదటి డీజిల్ కారు. ఈ కొత్త కారును థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉన్న ఆసియా పసిఫిక్ కంపెనీ లిమిటెడ్ ఆర్ అండ్ డి కేంద్రంలో అభివృద్ధి చేశారు.

హోండా అమేజ్ అమ్మకాలను పెంచుకునేందుకు గాను ఈ కారు కోసం ప్రత్యేకంగా ఓ 'హోండా కేర్ మెయింటినెన్స్ ప్యాకేజ్'ను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ ప్యాకేజ్‌ను పెట్రోల్ వేరియంట్‌కు రూ.9,996 మరియు డీజిల్ వేరియంట్‌కు రూ.15,375 లకే ఆఫర్ చేస్తున్నామని, ఇది రెండేళ్లు లేదా 40,000 కిలోమీటర్ల వరకూ చెల్లుబాటులో ఉంటుందని హోండా కార్స్ ఇండియా తెలిపింది.

Honda Amaze

హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 15.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇందిలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

హోండా అమేజ్ డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 25.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇందిలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్ అందుబాటులో లేదు.

హోండా అమేజ్ సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగులలో (మెజిస్టిక్ బ్లూ మెటాలిక్, కార్నెలియన్ రెడ్ పెరల్, అర్బన్ టైటానియం మెటాలిక్, అల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్, క్రిస్టల్ బ్లాక్ పెరల్ మరియు టఫేటా వైట్) లభిస్తుంది. ఇందులో డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్, ధృఢమైన బాడీ నిర్మాణం వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. అన్ని డీజిల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ఈబిడితో కూడిన ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 16, 2013, 11:22 [IST]
English summary
Honda Cars India has launched its all-new compact sedan, Honda Amaze in Chennai with the starting price of Rs 5.04 lakh (Ex-Showroom, Chennai). Honda Amaze comes in two versions, both petrol and diesel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+