నేపాల్ మార్కెట్లో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ విడుదల

Honda Amaze
జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా ఇటీవలే దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన 'హోండా అమేజ్' కాంపాక్ట్ సెడాన్‌ను త్వరలోనే పొరుగు దేశమైన నేపాల్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గడచిన మే నెలలోనే ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు హోండా తమ అమేజ్ సెడాన్‌ను నేపాల్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

నేపాల్‌లో సైకర్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా హోండా తమ అమేజ్ కార్లను అక్కడి మార్కెట్లో విక్రయించనుంది. పూర్తిగా భారతదేశంలో తయారైన అమేజ్ కార్లను నేపాల్‌కు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఎగుమతి చేయనున్నారు. నేపాల్ మార్కెట్లో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ప్రారంభ ధర రూ.15.92 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రూపాయి విలువతో పోల్చుకుంటే నేపాలీ రూపాయి విలువ తక్కువ కాబట్టే అక్కడి మార్కెట్లో ఇది అంత ధర పలుకుతుంది.

నేపాల్ మార్కెట్లో ఇది మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హోండా అమేజ్ ఈ ఎమ్‌టి - రూ.15.92 లక్షలు
  • హోండా అమేజ్ ఈఎక్స్ ఎమ్‌టి - రూ.16.55 లక్షలు
  • హోండా అమేజ్ ఎస్ ఎమ్‌టి - రూ.17.79 లక్షలు

ప్రారంభంలో భాగంగా నేపాల్‌లో అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కేవలం పెట్రోల్ వేరియంట్లోనే లభ్యం కానుంది. నేపాల్ వెర్షన్ హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 26, 2013, 12:50 [IST]
English summary
Honda's best selling compact sedan Amaze has been launched in Nepal at a starting price of Rs.15.92 Lac. Syakar Trading Company is the official dealer for selling the Honda cars in Nepal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+