ఫెస్టివ్ సీజన్ ఎఫెక్ట్; హోండా అమేజ్ అమ్మకాలు అమేజింగ్

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమటెడ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న 'హోండా అమేజ్'కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. హోండాకు ఇది తొలి డీజిల్ కారు కావటం, అలాగే సిటీ సెడాన్ దిగువన కాంపాక్ట్ సెడాన్ కావటంతో అమేజ్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన అక్టోబర్ 2013లో హోండా భారత మార్కెట్లో మొత్తం 11,214 కార్లను విక్రయించి, 39 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.

అక్టోబర్ 2012లో ఈ సంఖ్య 8,085 యూనిట్లుగా ఉంది. కంపెనీ మొత్తం అమ్మకాలలో ఎక్కువ భాగం హోండా అమేజ్ నుంచి వచ్చాయి. మొత్తమ్మీద ఏప్రిల్-అక్టోబర్ 2013 మధ్య కాలంలో హోండా కార్స్ ఇండియా మొత్తం అమ్మకాలు, గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 63 శాతం వృద్ధి చెంది 43,525 యూనిట్ల నుంచి 70,831 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతుల విషయానికి వస్తే, అక్టోబర్ 2013లో కంపెనీ మొత్తం 365 కార్లను ఎగుమతి చేసింది.

Honda Amaze

కంపెనీ అక్టోబర్ 2013 అమ్మకాల్లో మోడళ్ల వారీ వివరాలు ఇలా ఉన్నాయి:
  • హోండా అమేజ్ - 9564 యూనిట్లు
  • హోండా బ్రయో - 1472 యూనిట్లు
  • హోండా సిఆర్-వి - 87 యూనిట్లు
  • హోండా అకార్డ్ - 60 యూనిట్లు
  • హోండా సిటీ - 31 యూనిట్లు

More from DriveSpark

Article Published On: Saturday, November 2, 2013, 13:04 [IST]
English summary
Honda Cars India Ltd continues to flourish thanks to its compact sedan Amaze which continues to attract new customers. As expected, sales during the ongoing festive season has proved to be profitable for the automaker.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+