హోండా వెజెల్ రాదు.. హోండా బ్రయో ఎస్‌యూవీ వస్తుంది

By Ravi

జపనీస్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్ ఇటీవల ఆవిష్కరించిన హోండా వెజెల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత్‌కు వస్తుందని గతంలో మేము కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. అయితే, తాజా అప్‍‌డేట్ ప్రకారం భారత వంటి మార్కెట్ల కోసం హోండా వెజెల్‌ను ప్రవేశపెట్టడం ఖర్చు పరంగా అంత ఆమోదయోగ్యమైనదని కాదని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే, హోండా వెజెల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్థానంలో బ్రయో ఆధారిత ఎస్‌యూవీని విడుదల చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తుంది. హోండా ఇప్పటికే బ్రయో ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసిన అమేజ్ మంచి సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసినదే. అమేజ్‌ను బ్రయో ప్లాట్‌ఫామ్‌పై ఉత్పత్తి చేయటంతో కంపెనీ సరసమైన ధరకే ఈ కాంపాక్ట్ సెడాన్‌ను ఆఫర్ చేయగలిగింది.

Honda Vezel

అదేవిధంగా, బ్రయో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హోండా మొబిలో అనే ఎమ్‌పివిని కూడా కంపెనీ తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇది కూడా సరసమైన ధరకే వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, హోండా తయారు చేయనున్న కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా బ్రయో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా తయారు చేసినట్లయితే, దీని ఉత్పాదక వ్యయం తక్కువగా ఉండి, సరసమైన ధరకే ఈ మోడల్‌ను భారత మార్కెట్లో ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది.

హోండా ఏషియా అండ్ ఓషియానా మేనేజింగ్ ఆఫీసర్ తెలిపిన సమాచారం ప్రకారం, హోండా వెజెల్ ఈ సెగ్మెంట్లోనికి ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడుతున్నప్పటికీ, ధర విషయంలో మాత్రం ఇది ప్రీమియం మోడల్‌గా ఉంటుందని, ఇందుకు ప్రధాన కారణం బలహీనమైన రూపాయి విలువ కారణంగా, వెజెల్ లోకలైజేషన్‌లో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. హోండా వెజెల్‌ను కొత్త జాజ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని తయారు చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, December 30, 2013, 10:38 [IST]
English summary
Until now it was believed that the newly launched Honda Vezel compact SUV would be launched in India in 2015 to fill the gap between the CR-V and the City. Unfortunately, it turns out introducing the Vezel in India is not financially viable for the Japanese automaker.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+