ఏప్రిల్ 1 నుంచి మరింత ప్రియం కానున్న హోండా కార్లు

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) వచ్చే నెల నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచనుంది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, రవాణా ఛార్జీల ఫలితంగా ఏప్రిల్ 1 నుంచి అన్ని వాహనాల ధరలను 2 శాతం మేర పెంచుతున్నామని కంపెనీ ప్రకటించింది. ప్రధానంగా ఓబిడి (ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్) ఖర్చులకు కళ్లెం వేసేందుకే ధరలను పెంచుతున్నామని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం హోండా దేశీయ విపణిలో బ్రయో, జాజ్ హ్యాచ్‌బ్యాక్స్, సిటీ, సివిక్, అకార్డ్ సెడాన్స్ మరియు సిఆర్-వి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు రూ.4.1 లక్షల నుంచి రూ.27.38 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ప్రస్తుత ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో కంపెనీ అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. గడచిన ఫిబ్రవరి నెలలో కంపెనీ అమ్మకాలు 26.49 శాతం క్షీణించి 8856 యూనిట్ల నుంచి 6510 యూనిట్లకు పడిపోయాయి.

హోండా ఇటీవలే విడుదల చేసిన సరికొత్త హోండా సిఆర్-వి అమ్మకాలు కూడా మందకొడిగానే ఉన్నాయి. కాగా.. కంపెనీ తమ సరికొత్త ఎంట్రీ-లెవల్ సెడాన్ కారు 'అమేజ్'ను ఈ నెలాఖరు నాటికి కానీ లేదా ఏప్రిల్ ప్రధమార్థంలో కానీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది హోండా నుంచి వస్తున్న మొట్టమొదటి డీజిల్ కారు కావటంతో మార్కెట్లో కంపెనీ అమ్మకాలు మళ్లీ జోరందుకు సూచనలున్నాయి.

Honda Brio

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2013, 5:40 [IST]
English summary
Honda Cars India Ltd (HCIL) will increase prices of its vehicles across models by up to 2 per cent from April to offset cost of OBD (on-board diagnostics) compliance and freight increase.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+