హోండా సిటీ డీజిల్ ఖరారు; 2014లో విడుదల

By Ravi

హోండా కార్ ప్రియులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తున్న హోండా సిటీ సెడాన్, వచ్చే ఏడాది నుంచి డీజిల్ వెర్షన్‌లో కూడా లభ్యం కానుంది. హోండా కార్స్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ తొలి డీజిల్ కారు అమేజ్, ఊహించని రీతిలో విజయం సాధించడంతో, దేశీయ విపణిలో తమ డీజిల్ కార్ల పోర్ట్ ఫోలియో విస్తరించుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, 2014లో డీజిల్ వెర్షన్ సిటీ సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు హోండా పేర్కొంది.

వచ్చే ఏడాది డీజిల్ వెర్షన్ సిటీ విడుదలతో పాటుగా, తమ సరికొత్త రీస్టయిల్డ్ హోండా జాజ్ కారును కూడా కంపెనీ విడుదల చేయనుంది. కొత్త జాజ్ విడుదల ద్వారా భారత ఆటోమొబైల్ మార్కెట్లో 'క్రాసోవర్ యుటిలిటీ వెహికల్' అనే కొత్త సెగ్మెంట్‌ను సృష్టించనున్నామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. నవంబర్ నెలలో దీనిని (కొత్త జాజ్‌ను) జపాన్ మార్కెట్లో విడుదల చేస్తామని, ఆ తర్వాత 2014లో భారత్‌లో విడుదల చేస్తామని ఆయన చెప్పారు.


హోండా అమేజ్ కారులోని డీజిల్ ఇంజన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిటీ సెడాన్‌లో సరిపోదు కాబట్టే, సిటీ సెడాన్ డీజిల్ వెర్షన్ విడుదల జాప్యమయ్యిందని, అందుకే కొత్త సిటీ కారును తయారు చేస్తున్నామని, డీజిల్ వెర్షన్ సిటీ విడుదలతో ఈ పాపులర్ కారు అమ్మకాలు మరింత జోరందుకునే ఆస్కారం ఉందని జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. హోండా నుంచి రానున్న కొత్త జాజ్ కూడా పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో లభ్యం కానుంది. ఈ రెండు కార్లకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
New Jazz

More from DriveSpark

Article Published On: Monday, October 7, 2013, 15:07 [IST]
English summary
Honda Cars India Ltd (HCIL) said it would soon launch its two cars in new Avtar a diesel variety of city and relook Jazz. Also the company would create a new segment which would boat of faster, sleeker and smarter vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+