ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో విడుదల కానున్న హోండా సివిక్ టూరర్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సివిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో అభివృద్ధి చేసిన ఓ మల్టీ పర్సప్ వెహికల్ 'హోండా సివిక్ టూరర్' (Honda Civic Tourer)ను వచ్చే నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో, హోండా సివిక్ టూరర్‌కు సంబంధించిన అఫీషియలో ఫొటోలను, సమాచారాన్ని కంపెనీ విడుదల చేసింది.

యూరప్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం సాయంతో హోండా ఈ కొత్త సివిక్ టూరర్‌ను అభివృద్ధి చేసింది. ఈ కారులో ఎర్త్ డ్రీమ్స్ టెక్నాలజీ సిరీస్‌లో అభివృద్ధి చేసిన కంపెనీ తొలి డీజిల్ ఇంజన్ (1.6 లీటర్ ఐ-డిటెక్)ను కానీ లేదా 1.8 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను కానీ ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్లు మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో లభ్యమయ్యే అవకాశాలున్నాయి.

హోండా సివిక్ టూరర్‌ను తొలుత యూకే ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు, 2014 ఆరంభంలో ఇది యూరప్ మార్కెట్లలో విడుదల కానుంది. సివిక్ టూరర్ భారత్‌కు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. హోండా సివిక్ టూరర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా సివిక్ టూరర్

తొలి చూపుల్ సివిక్ టూరర్ ఇతర వ్యాగన్ల మాదిరిగా కనిపించదు. ఇటీవల విడుదలైన కార్లన్నీ దాదాపుగా ఒకే స్టయిల్‌ను ఫాలో అవుతున్నాయి. అయితే, సివిక్ టూరర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుందని సివిక్ టూరర్ లార్జ్ ప్రాజెక్ట్ లీడర్ ఆండ్రియన్ కిల్లమ్ అన్నారు.

హోండా సివిక్ టూరర్

సివిక్ టూరర్ పొడవును భారీగా పెంచారు. హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ సివిక్‌తో పోల్చుకుంటే, దీని పొడవు 235 మి.మీ. ఎక్కువగా ఉంటుంది. (మొత్తం పొడవు 4250 మి.మీ.).

హోండా సివిక్ టూరర్

సివిక్ టూరర్ పొడవును పెంచడం వలన కారు లోపల విశాలమైన స్పేస్ లభిస్తుంది. ఈ కారులో వెనుక సీట్లు మడవక ముందు 624 లీటర్ల స్పేస్ ఉంటుంది (ఇన్నోవాలో లభ్యమయ్యే దానికన్నా 3 రెట్లు అధికం). అదే వెనుక సీట్లను మడిచితే ఇది 1,668 లీటర్లకు పెరుగుతుంది.

హోండా సివిక్ టూరర్

హోండా ఈ కారులోని సీట్లను 'మ్యాజిక్ సీట్స్' అని పిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణంగా ఈ సీట్లను ప్యాసింజర్ల సౌకర్యానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకునే వీలుంటుంది.

హోండా సివిక్ టూరర్

హోండా తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కారులో విశాలమైన కార్గో (లగేజ్) స్పేస్ ఉంటంది. ఇందులో ఓ రెండు ఫుల్ సైజ్ మౌంటైన్ బైక్స్ లేదా 3 పెద్ద సైజు శామ్‌సొనైట్ కేసులను స్టోర్ చేసుకోవచ్చు.

హోండా సివిక్ టూరర్

సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో అడాప్టివ్ డ్యాంపర్ సిస్టమ్ (ఏడిఎస్) అనే కొత్త వ్యవస్థను రూపొందించారు. ఇది కంఫర్ట్, నార్మల్, డైనమిక్ అనే మూడు రకాల డ్రైవ్ సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది. నడిపే రోడ్డు, డ్రైవింగ్ వాతావరణాన్ని బట్టి ఈ ఏడిఎస్ సిస్టమ్ స్టెబిలిటీని, కంఫర్ట్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రొడక్షన్ కారులో రియర్ అడాప్టివ్ డ్యాంపర్ సిస్టమ్‌ను పరిచయం చేయటం ఇదే మొదటిసారి.

హోండా సివిక్ టూరర్

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో కొత్త ఎర్త్ డ్రీమ్స్ 118 హార్స్ వపర్, 1.6 లీటర్, ఐ-డిటెక్ టర్బో డీజిల్ ఇంజన్, అలాగే 1.8 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. ఇవి మ్యాన్యువల్ లేదా ఆటోమోటిక్ ట్రాన్సిమిషన్లతో లభ్యమవుతాయి.

హోండా సివిక్ టూరర్

ఏడాది ఆరంభంలో జరిగిన 2013 జెనీవా మోటార్స్ హోండా సివిక్ టూరర్‌ను కాన్సెప్ట్ రూపంలో తొలిసారిగా ప్రదర్శనకు ఉంచారు. కాగా.. ప్రస్తుతం మనం చూస్తున్నది ప్రొడక్షన్ వెర్షన్ సివిక్ టూరర్. దీనిని ధర ఇతర వివరాలు సెప్టెంబర్‌లో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో వెల్లడి కానున్నాయి.

ఇది హోండా సివిక్ 5-డోర్ హ్యాచ్‌బ్యాక్

ఇది హోండా సివిక్ 5-డోర్ హ్యాచ్‌బ్యాక్

సివిక్ హ్యాచ్‌బ్యాక్ vs సివిక్ టూరర్

కొలతలు: పొ x వె x ఎ - 4285/1770/1440 vs 4520/1770/144 (మి.మీ)

వాల్యూమ్ లగేజ్ స్పేస్: 477 మి.మీ vs 624 మి.మీ (సీట్లు దించక మునుపు)

లగేజ్ స్పేస్: 1378 మి.మీ vs 1668 మి.మీ (సీట్లు దించిన తర్వాత)

లోడ్ హైట్: 702 మి.మీ vs 564 మి.మీ

More from DriveSpark

Article Published On: Monday, August 12, 2013, 16:57 [IST]
English summary
Indian auto market is noticeably devoid of a proper tourer/estate vehicle. A car which can be used for long tours and has enough space to accommodate an entire family, along with articles required for the entire length of the holiday. The sort of car which we are talking about is the Honda Civic Tourer. A brand new estate vehicle that is based on the Civic hatchback and is scheduled to break cover at the Frankfurt Auto Show in September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+