విపణిలోకి హోండా సీఆర్-వి, ధర రూ.19.95లక్షలు
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా, కొత్త మోడల్ ఫోర్ వీలర్ వాహనం 'సీఆర్-వీ'ని దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.19.95లక్షలు. ఈ కొత్త ఎడిషన్ హోండ్ సీఆర్-వీ నూతన్ గ్రిల్‌తో కూడిన హెడ్లైట్లను కలిగి ఉంది. మునుపటి వర్షన్ (30ఎమ్ఎమ్)తో పోలిస్తే 'సీఆర్-వీ' వీల్ బేస్ 2620ఎమ్ఎమ్. ఈ ఫోర్ వీలర్ ఇంటీరియర్ కొత్త స్టైల్‌ను సంతరించుకుని ఉంది. డాష్ బోర్డ్ ఇంకా స్టీరింగ్ వీల్‌లు కొత్త లుక్‌ను కలిగి ఉన్నాయి. ఆడియో ఇంకా క్రూజీ కంట్రోల్ బటన్‌లను స్టీరింగ్‌లో వ్యవస్థీకరించారు. మల్టీ సమాచార వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. టీవీకార్యక్రమాల విక్షణ, డీవీడీ, యూఎస్బీ, ఐపోడ్ కనెక్టువిటీ, రివర్స్ కెమెరా, బ్లూటూత్ కనెక్టువిటీ, శాటిలైన్ నేవిగేషన్ వంటి ప్రత్యేక వసతులు సీఆర్-వీలో కనిపిస్తాయి.
ఇండియన్ మార్కెట్లో హోండా సీఆర్-వి, పెట్రోల్ ఇంజన్ వర్షన్‌లో మాత్రమే లభ్యంకానుంది. భారత హోండా అభిమానులకు ఈ అంశం కొంత మేర నిరుత్సాహం కలిగించేదే. 2లీటర్ ఇంకా 2.4లీటర్ పెట్రోల్ ఇంజన్ వర్షన్‌లలో 'సీఆర్-వి'ని విక్రయించనున్నారు. 2-లీటర్ ఇంజన్ 156పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2.4 - లీటర్ ఇంజన్ 190పీఎస్ శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ ఫోర్ స్పీడ్ ఆటోమెటిక్, ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మోడళ్లలో లభ్యమవుతుంది. 2లీటర్ వర్షన్ గంటకు 13.7 కిలోమీటర్లు, 2.4లీటర్ వర్సన్ గంటకు 12 కిలోమీటర్ల మైలేజ్‌నిస్తుందని హోండా పేర్కొంది.

సరికొత్త హోండా సీఆర్-వి నాలుగు వేరియంట్ లలో లభ్యమవుతోంది. వాటి వివరాలు..
2.0ఎ ఎంటీ ధర రూ19.5లక్షలు,
2.0ఎల్ ఏటీ ధర రూ 20.85 లక్షలు,
2.4ఎల్ ఏటీ ధర రూ22.4 లక్షలు,
2.4ఎల్ ఏటీ ఏవీఎన్ ధర రూ.23.85లక్షలు.


Click it and Unblock the Notifications








