ఫిబ్రవరి 12న మార్కెట్లోకి రానున్న సరికొత్త హోండా సిఆర్-వి
హోండా సిఆర్-విలో సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ విడుదల గురించి తెలుగు డ్రైవ్ స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజా అప్‌డేట ప్రకారం, సరికొత్త హోండా 2013 సిఆర్-వి వచ్చే నెల 12వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది. హోండా కార్స్ ఉండియా ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త సిఆర్-వి కోసం ఓ టీజర్‌ను కూడా ప్రారంభించింది. ఈ టీజర్ ప్రకారం, ఫిబ్రవరి 12, 2013 నుంచి ఈ కొత్త 2013 హోండా సిఆర్-వి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
సరికొత్త ఫ్రంట్ డిజైన్, స్టయిలిష్ లుక్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, రీడిజైన్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, హోండా లోగోతో కూడిన త్రీ లైన్ క్రోమ్ గ్రిల్, సన్నగా ఉండే ఎయిర్ డ్యామ్, కొత్త ఫ్రంట్ బంపర్, ఆకర్షనీయమైన అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఈ అప్‌గ్రేడెడ్ హోండా సిఆర్-విలో గమనించవచ్చు. అలాగే ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కోసం కొత్త సిఆర్-వి పొడవును కొద్దిగా పెంచినట్లు తెలుస్తోంది.
మరింత స్పోర్టీ లుక్ ఇచ్చేలా తీర్చిదిద్దిన ఏరోడైనమిక్స్, మెరుగైన మైలేజీనిచ్చేలా రీట్యూన్ చేసిన ఇంజన్ వంటి అనేక మార్పులతో కొత్త హోండా సిఆర్-వి లభ్యం కానుంది. దేశీయ విపణిలో 2013 హోండా సిఆర్-వి ధర రూ.20 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఈ అప్‌గ్రేడెడ్ సిఆర్-వి క్రాసోవర్‌ను హోండా తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన 2011 ఆరంజ్ కౌంటీ ఇంటర్నేషనల్ ఆటో షోలో ఆవిష్కరించారు. అనంతరం దీనిని 2011 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో కూడా ప్రదర్శించటం జరిగింది.

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి
కొత్త 2013 హోండా సిఆర్-విలో 2.0 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. ఇది గరిష్టంగా 155 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. త్వరలో మార్కెట్లోకి రానున్న కొత్త 2013 హోండా సిఆర్-వి ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, చెవర్లే కాప్టివా వంటి మోడళ్లు సవాలుగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








