భారత్‌కు రానున్న హోండా లగ్జరీ కార్ బ్రాండ్ 'ఆక్యురా'

By Ravi

జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్‌కు చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ 'అక్యురా' (Acura) త్వరలోనే ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం అంతర్జాతీయ మార్కెట్లకు మాత్రమే పరిమితమైన ఈ లగ్జరీ కార్లను భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చే సాధ్యాసాధ్యాలపై కంపెనీ కసరత్తులు చేస్తోంది.

హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ హిరోనోరి కనయమా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అక్యురా బ్రాండ్‌ను భారత్‌కు తీసుకువచ్చే అంశాన్ని ప్రస్తావించారు. భారత మార్కెట్ మెచ్యూర్ అయిన తర్వాత ఈ బ్రాండ్‌ను ఇక్కడి మార్కెట్‌‌కు పరిచయం చేస్తామని, అంత వరకు తమ ప్రయారిటీ లగ్జరీ కార్లపై ఉండబోదని స్పష్టం చేశారు.


హిరోనోరి కనయమా వ్యాఖ్యలు చూస్తుంటే, కంపెనీ ఈ లగ్జరీ బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ, అది అంత త్వరగా జరిగే అవకాశం మాత్రం కనిపించడం లేదు. హోండా తమ అక్యురా బ్రాండ్ క్రింద లగ్జరీ కార్లను, పెర్ఫామెన్స్ కార్లను తయారు చేస్తుంది. ఇది అమెరికాలో మోటార్‌స్పోర్ట్ విభాగంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

భారత్‌లో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ కంపెనీ మంచి వృద్ధిని కనబరుస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఆయా కంపెనీలు కేవలం లగ్జరీ కార్లపైనే దృష్టి సారిస్తాయి కాబట్టి, సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకోగలుగుతున్నాయి. హోండా విషయంలో ఈ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండనుంది.

Honda Acura Sedan

హోండా ఇటు ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని, అటు లగ్జరీ కార్ల వ్యాపారాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. మరో జపాన్ కంపెనీ టొయోటా కూడా తమ లగ్జరీ బ్రాండ్లు లెక్సస్, ఇన్ఫినిటీ లను కూడా భారత్‌లో విడుదల చేయాలని యోచిస్తోంది. ఏదేమైనప్పటికీ, సికెడి రూట్లో ఇండియాకు రానున్న ఈ విలాసవంతమైన కార్లు సామాన్యులకే కాదు ధనికులకు కూడా ధర పరంగా చుక్కలు చూపించే ఆస్కారం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2013, 15:12 [IST]
English summary
Honda is not averse to the idea of introducing cars belonging to its halo brand, Acura in India. Cars from this luxury division of Honda are sold in a few countries across the world, which includes North America and China. The division is also involved in motorsports in America.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+