హోండా మొబిలో ఎమ్‌పివి విడుదల ఎప్పుడంటే..?

By Ravi

హోండా మొబిలో ఎమ్‌పివి గుర్తుందా..? జపనీస్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న చిన్న కారు బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, అభివృద్ధి చేసిన ఈ హోండా మొబిలో ఎమ్‌పివిని కంపెనీ ఇటీవల ఇండోనేషియన్ ఇండోనేషియన్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ ఎమ్‌పివి విషయంలో తాజా అప్‌డేట్ ప్రకారం, హోండా వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఈ మొబిలో ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

భారత కార్ మార్కెట్లోని ఎమ్‌పివి సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, చెవర్లే ఎంజాయ్, టొయోటా ఇన్నోవా వంటి మోడళ్లకు పోటీగా హోండా మొబిలో రానుంది. భారత మార్కెట్లో హోండా తొలి డీజిల్ కారు అమేజ్ మంచి సక్సెస్‌ను సాధించడంతో, దేశీయ విపణిలో మరిన్ని డీజిల్ కార్లను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, ఈ నెలాఖరు నాటికి ఓ సరికొత్త హోండా సిటీ కారును కంపెనీ విడుదల చేయనుంది. ఇందులో డీజిల్ వెర్షన్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం.

Honda Mobilo

అలాగే, హోండా నుంచి వచ్చే మార్కెట్లోకి రానున్న మొబిలో ఎమ్‌పివి కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2014లో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హోండా తమ ప్రొడక్షన్ వెర్షన్ మొబిలోను ప్రదర్శించనుంది. దీంతో పాటుగా ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా హోండా ప్రదర్శించే అవకాశాలున్నాయి. హోండా మొబిలో కాంపాక్ట్ డిజైన్ కలిగిన ఓ ఫుల్‌సైజ్ ఎమ్‌పివి.

బ్రయో, అమేజ్‌లను డిజైన్‌ను చేసిన ప్లాట్‌ఫామ్ మీదనే మొబిలోను కూడా డిజైన్ చేశారు. అయితే, మొబిలో వీల్‌బేస్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్‌లు అమేజ్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ముందు వైపు డిజైన్‌ను గమనిస్తే, ఇది బ్రయో, అమేజ్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. మిగిలిన భాగాన్ని ప్రత్యేకించి పై భాగం మరియు వెనుక భాగాలను కొత్తగా డిజైన్ చేశారు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/PFwg7t9lGuI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
హోండా మొబిలో ఎమ్‌పివి అధునాత సేఫ్టీ ఫీచర్లతో లభ్యం కానుంది. ఇందులో ప్రధానంగా జి-కాన్ (జి-ఫోర్స్ కంట్రోల్ టెక్నాలజీ), ఏసిఈటిఎమ్, ఏబిఎస్, ఈబిడి బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్ విత్ లోడ్ లిమిటర్, ఇంపాక్ట్ మిటిగేటింగ్ హెడ్ రెస్ట్స్, సెర్టా పెడస్టేరియన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. దేశీయ విపణిలో హోండా మొబిలో ధర రూ.8.5 లక్షల నుంచి రూ.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, November 7, 2013, 16:40 [IST]
English summary
According to recent reports, the Brio based Honda Mobilio MPV, which was unveiled at the 2013 Indonesia International Motor Show earlier this year, is expected to reach Indian market by mid-2014.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+