సెకండ్ జనరేషన్ హోండా సిటీ కార్లు రీకాల్

డ్రైవర్ సైడ్ విండోలోకి నీరు లేదా ఏదైనా ఇతర ద్రవపదార్ధం వెళ్లినప్పుడు ఈ స్విచ్‌లో సమస్యలు తలెత్తి, పవర్ విండోస్ పనిచేయకపోవటం వంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ రీకాల్‌ను ప్రకటించింది. అయితే, ఈ సమస్యకు సంబంధించి దేశంలోని ఏవైపు నుంచి హోండాకు ఫిర్యాదులు రానప్పటికీ, ముందస్తు నివారణ చర్యగా కంపెనీ ఈ రీకాల్‌ను చేపట్టింది.
హోండా రీకాల్ చేసిన సిటీ కార్లలో ఈ పవర్ విండోస్ స్విచ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌సిఐఎల్ డీలర్‌షిప్ కేంద్రాలలో ఉచితంగా రీప్లేస్ చేయనుంది. ఇందుకు సంబంధించి సదరు సిటీ కార్ల యజమానులకు ప్రత్యేకంగా దశల వారీగా తెలియజేయటం జరుగుతుంది. తమ ఉత్పత్తుల నాణ్యతా ప్రణాలను మరింత పటిష్టం చేసే దిశలో భాగంగానే ఈ రీకాల్ నిర్వహిస్తున్నామని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా.. ప్రస్తుతం హోండా దేశీయ విపణిలో విక్రయిస్తున్న థర్డ్ జనరేషన్ హోండా సిటీ కార్లలో ఈ సమస్య లేదని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








