మే నెలలో 6036 అమేజ్ సెడాన్లను విక్రయించిన హోండా

By Ravi

హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న లేటెస్ట్ కార్ 'అమేజ్' సెడాన్ అమేజింగ్ పెర్ఫామెన్స్‌ను కనబరుస్తోంది. గడచిన ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి వచ్చిన హోండా అమేజ్ భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఇది హోండా అందిస్తున్న తొలి డీజిల్ కారు కావడంతో పాటుగా, కాంపాక్ట్ డిజైన్‌‌ను కలిగి విశిష్టమైన ఫీచర్లతో లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఈ మోడల్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోను ఇది మంచి అమ్మకాలను నమోదు చేసుకుంది.

గడచిన మే నెలలో హోండా మొత్తం 6,036 అమేజ్ సెడాన్లను విక్రయించింది. హోండా కార్స్ ఇండియా మొత్తం నెల అమ్మకాల్లో 53 శాతం అమ్మకాలు అమేజ్ ద్వారానే రావటం విశేషం. ఈ సమయంలో హోండా మొత్తం 11,342 యూనిట్లను విక్రయిస్తే అందులో 6,036 యూనిట్లు అమేజ్ కార్లే ఉన్నాయి. ఇదే సమయంలో 736 యూనిట్లను ఎగుమతి కూడా చేసింది. ఈ ఎగుమతులను కూడా కలుపుకుంటే, మే 2013 నెలలో హోండా మొత్తం అమ్మకాల సంఖ్య 12,080 యూనిట్లుగా ఉన్నాయి.

Honda Amaze

More from DriveSpark

Article Published On: Saturday, June 1, 2013, 20:42 [IST]
English summary
As per the sales figures of Honda in May 2013, Amaze sold 6,036 units in May, which contributes to 53% of the total Honda sales in India during the month. Honda's total sales stood at 11,342. The Japanese carmaker also exported 736 units of Brio thereby taking total Honda sales during month to 12,080 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+