వచ్చే నెలలో నెక్స్ట్ జనరేషన్ హోండా సిటీ ఆవిష్కరణ
ఒకప్పుడు సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న హోండా సిటీ సెడాన్, డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేని కారణంగా క్రమంగా తన నాయకత్వ స్థానాన్ని కోల్పోయిన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు హోండా సిటీ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా సరికొత్త డిజైన్‌తో తిరిగి తన లీడర్‌షిప్ పొజిషన్‌ను దక్కించుకునేందుకు ముస్తాబవుతోంది.
హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో విడుదల చేసిన తొలి డీజిల్ కారు అమేజ్ భారీ సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, హోండా మరిన్ని డీజిల్ కార్లను భారత్‌కు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులో ఓ డీజిల్ కారే ఈ నెక్స్ట్ జనరేషన్ హోండా సిటీ సెడాన్. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, హోండా వచ్చే నెలలో ఓ కొత్త సిటీ సెడాన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

హోండా సిటీ సెడాన్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు ఎగ్జిక్యూటివ్ సెడాన్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది హోండా సిటీనే. అయితే, పెరిగిన పోటీ వాతవరణంలో, ఈ సెగ్మెంట్లోకి అనేక కొత్త మోడళ్లు వచ్చి చేరాయి. దీంతో సిటీ తన ప్రాచుర్యాన్ని క్రమంగా కోల్పోతూ వస్తోంది. కానీ, ఇందులో డీజిల్ వెర్షన్ వస్తే, మళ్లీ ఈ మోడల్ అమ్మకాలు జోరందుకునే ఆస్కారం ఉంది.
ఎర్త్ డ్రీమ్ సంస్థతో కలిగి హోండా అభివృద్ధి చేసిన ఓ అధునాతన డీజిల్ ఇంజన్‌ను కొత్త హోండా సిటీలో అమర్చనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో హోండా తమ డీజిల్ వెర్షన్ సిటీ సెడాన్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2014లో ఢిల్లీ ఆటో ఎక్స్‌పో సమయంలో హోండా తమ సిటీ డీజిల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇదే షోలో హోండా తమ నెక్స్ట్ జనరేషన్ సిటీతో పాటుగా ఓ సరికొత్త రీస్టయిల్డ్ హోండా జాజ్ ప్రీమియం క్రాసోవర్ కారును కూడా కంపెనీ విడుదల చేయనుంది. కొత్త జాజ్ విడుదల ద్వారా భారత ఆటోమొబైల్ మార్కెట్లో 'క్రాసోవర్ యుటిలిటీ వెహికల్' అనే కొత్త సెగ్మెంట్‌ను సృష్టించనున్నామని గతంలో ఓ సందర్భంలో హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు.


Click it and Unblock the Notifications








