ఐదేళ్ల తర్వాత తిరిగి ఎఫ్1 లోకి రీఎంట్రీ ఇస్తున్న హోండా

By Ravi

కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ ఫార్ములా వన్ సిరీస్‌కు దూరంగా ఉన్న జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'హోండా మోటార్ కార్పోరేషన్ లిమిటెడ్' తిరిగి ఫార్ములా వన్‌లో పాల్గొనబోతుంది. మెక్‌లారెన్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యంలో భాగంగా 2015 నుంచి ఎఫ్ఐఏ ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో హోండా పాల్గొననుంది.

ఈ ఒప్పందంలో భాగంగా ఇంజన్ మరియు ఎనర్జీ రికవరీ సిస్టమ్ వంటి పవర్ యూనిట్ల తయారీ మరియు సరఫరాలకు హోండా మోటార్ కార్పోరేషన్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా, ఛాస్సిస్ మరియు కొత్త టీమ్ యొక్క నిర్వహణకు మెక్‌లారెన్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుంది. 2014 నుంచి కొత్త ఎఫ్1 రెగ్యులేషన్ల ప్రకారం, ఎనర్జీ రికవరీ సిస్టమ్స్‌తో కూడిన 1.6 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బోఛార్జ్‌డ్ వి6 ఇంజన్‌ను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు సంస్థలు ఒకటిగా చేరి సరికొత్త ఫార్ములా వన్ కార్లను తీసుకురానున్నాయి.

హోండా ఎఫ్1 రేసింగ్ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే..

  • 1964 - 1968: ఇంజన్ అండ్ ఛాస్సిస్‌తో కలిపి 'ఆల్ హోండా' టీమ్‌గా పాల్గొంది
  • 1983 - 1992: ఇంజన్ సప్లయర్‌గా పాల్గొంది (1988 నుంచి 1991 వరకు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు డ్రైవర్ అండ్ కన్‌స్ట్రక్టర్స్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకుంది)
  • 2000 - 2005: ఇంజన్ సప్లయర్ మరియు జాయింట్ ఛాస్సిస్ సప్లయర్‌గా పాల్గొంది
  • 2006 - 2008: ఇంజన్ అండ్ ఛాస్సిస్‌తో కలిపి 'ఆల్ హోండా' టీమ్‌గా పాల్గొంది
Honda F1

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2013, 16:48 [IST]
English summary
Japanese car manufacturer Honda Motor Co. Ltd. is returning to Formula One in 2015 as an engine supplier to McLaren. The company left the sport in 2008 because of financial trouble but their president, Takanobu Ito, said they will be returning in 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+