డిఎస్‌కె మోటోవీల్స్ నుంచి 'హ్యోసంగ్ 125సీసీ బైక్'
భారత్‌లో హ్యోసంగ్ అధీకృత డీలర్ డిఎస్‌కె మోటోవీల్స్, దేశీయ విపణిలో ఓ బడ్జెట్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 125సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను హ్యోసంగ్ ప్రవేశపెట్టనుంది. 2015-16 నాటికి తక్కువ సీసీ ఇంజన్ కలిగిన బైక్‌ను విడుదల చేస్తామని కంపెనీ చైర్మన్ శిరీష్ కులకర్ణి వెల్లడించారు.
ప్రస్తుతం హ్యోసంగ్ తమ బైక్‌లను పూనేకు సమీపంలోని వాయ్ వద్ద ఉన్న అసెంబ్లింగ్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తోంది. కాగా.. ఈ కొత్త 125సీసీ బైక్‌ను మాత్రం కర్ణాటకలోని కరాద్ వద్ద ఏర్పాటు చేస్తున్న కొత్త ప్లాంటులో ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ప్లాంట్ కోసం కంపెనీ రూ.200 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఇది పూర్తిస్థాయిలో నిర్వహణలోకి రానుంది.

హ్యోసంగ్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న మోడళ్లలో ఓ 125సీసీ ట్విన్ సిలిండర్ మోటార్‌సైకిల్ ఉంది. అయితే, ఈ ఇంజన్ కాన్ఫిగరేషన్ ఇండియన్ మార్కెట్‌కు సూట్ అవ్వదు. ఈ నేపథ్యంలో, సింగిల్ సిలిండర్ కలిగిన కొత్త 125సీసీ ఇంజన్‌ను హ్యోసంగ్ తయారు చేయాల్సి ఉంటుంది. దీని ధరను తక్కువగా ఉంచాలంటే, ఈ ఇంజన్ తయారీలో ఎక్కువ భాగం స్థానికంగా లభించే విడిభాగాలను ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








