హ్యుందాయ్ యాక్సెంట్ నిలిపివేత; కొత్త కారు వస్తోంది..

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి ఒకప్పుడు దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడుపోయినటువుంటి చీప్ అండ్ బెస్ట్ ఎంట్రీ లెవల్ పెట్రోల్ సెడాన్ హ్యుందాయ్ యాక్సెంట్ (Hyundai Accent) ఇప్పుడు భారత రోడ్లపై మాయం కానుంది. హ్యుందాయ్ ఇప్పటికే ఈ పెట్రోల్ సెడాన్ ఉత్పత్తి, అమ్మకాలను కూడా నిలిపివేసింది. ఇప్పటి వరకు ఉన్న హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్ స్టాక్ కూడా పూర్తిగా క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

భారత్‌లో హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్ విఫలం కావటానికి ప్రధాన కారణం, ఇది కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుండటం. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌‌పిఎమ్ వద్ద 95 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 3500 ఆర్‌‌పిఎమ్ వద్ద 12.7 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

Hyundai Accent

హ్యుందాయ్ తమ భారత్‌లోని చెన్నై ప్లాంటులో డొమెస్టిక్ మోడల్ యాక్సెంట్ ఉత్పత్తి మాత్రమే నిలిపి వేసింది. అయితే, ఈ ప్లాంటులో ఎగుమతి వెర్షన్ యాక్సెంట్ ఉత్పత్తిని మాత్రం కంపెనీ యధావిధిగా కొనసాగిస్తుంది. హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్‌ను భారత్ నుంచి తొలగించినప్పటికీ, దాని స్థానంలో ఓ కొత్త కారును ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

కాగా.. హ్యుందాయ్ నుంచి కొత్తగా రానున్న ఈ కారు పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండి, స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. హ్యుందాయ్ ఓ కాంపాక్ట్ సెడాన్‌తో పాటుగా, ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అలాగే ఓ మల్టీ పర్పస్ వెహికల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, October 18, 2013, 19:20 [IST]
English summary
Hyundai Motor India has phased out its once best-selling sedan, the Accent. The company is now planning to introduce a fresh product in the same category along with a compact SUV and a multipurpose vehicle said a top HMIL official.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+