ఫిబ్రవరి నుంచి మరింత ప్రియం కానున్న హ్యుందాయ్ కార్లు

పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 2013 నుంచి తమ ఉత్పత్తులను ధరలను పెంచుతామని హ్యుందాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే దేశపు అగ్రగామి మారుతి సుజుకి ఇండియా తమ ఉత్పత్తుల ధరలను గడచిన ఈ నెల 16 నుంచి రూ.20,000 మేర పెంచగా, తాజా ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ పోలో, వెంటో కార్ల ధరలను సుమారు రూ.20,000 మేర పెంచిన సంగతి తెలిసిందే.
ఇదే కోవలో హ్యుందాయ్ కూడా తమ ఉత్పత్తులను పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం హ్యుందాయ్ దేశీయ విపణిలో ఇయాన్, శాంత్రో జింగ్, ఐ10, ఐ20, యాక్సెంట్, వెర్నా, ఎలాంట్రా, సొనాటా, శాంటాఫే మోడళ్లను అందిస్తోంది. భారత మార్రెట్లో వీటి ధరలు రూ.2.77 లక్షల (ఇయాన్) నుంచి రూ.25.43 లక్షల (శాంటాఫే) రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


Click it and Unblock the Notifications








