ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2013 కోసం హ్యుందాయ్ ఫస్ట్ బాల్ టూర్

By Ravi

అంతర్జాతీయ క్రికెక్ సమాఖ్య (ఐసిసి)కు అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2013లో ఉపయోగించనున్న మొదటి బంతి (ఫస్ట్ బాల్)ని ప్రదర్శనకు ఉంచింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ 6, 2013 నుంచి ప్రారంభమవుతుంది.

ఇంగ్లాండ్‌లోని సోఫియా గ్రౌండ్‌లో భారత్, ధక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్ యొక్క క్రికెట్ బాల్స్ సెట్‌ను ప్రదర్శించేందుకు హ్యుందాయ్ హక్కులను కలిగి ఉంది. ఈ మొదటి బంతి ప్రదర్శను హ్యుందాయ్ మే 30వ తేది నుంచి జూన్ 4, 2013వ తేది వరకూ న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, డెహ్రడూన్, పూనే, అహ్మదాబాద్, ఛండీఘడ్‌లలోని తమ అధీకృత షోరూమ్‌లలో ప్రజల సందర్శనార్థం కంపెనీ అందుబాటులో ఉంచనుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐసిసితో అధికారిక కార్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 2015 వరకూ ఐసిసితో హ్యుందాయ్ ఈ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. గడచిన సవత్సరంలో జరిగిన 4వ ఐసిసి వరల్డ్ ట్వెంటీ20 2012 తొలి మ్యాచ్‌లో ఉపయోగించనున్న మొదటి బంతి (ఫస్ట్ బాల్) సెట్‌ను ప్రదర్శించేందుకు కంపెనీ ఓ హ్యుందాయ్ ఇయాన్ కారును ప్రత్యేకంగా బ్రాండింగ్ చేసిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2013 కోసం కంపెనీ ఓ హ్యుందాయ్ ఐ20 కారును బ్రాండింగ్ చేయనుంది.

Hyundai Starts First Ball Tour For ICC Champions Trophy 2013

More from DriveSpark

Article Published On: Thursday, May 30, 2013, 16:08 [IST]
English summary
Hyundai Motor India Limited (HMIL) has showcased the ‘First Ball’ for ICC Champions Trophy 2013. Hyundai holds the exclusive rights to showcase the set of Cricket Balls of first match between India and South Africa which is scheduled on June 6, 2013 at Sophia Gardens, Cardiff, England.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+