హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 బుకింగ్స్ ప్రారంభం!?

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈనెల (ఆగస్ట్) ఆరంభంలో ఆవిష్కరించిన తమ తొలి కాంపాక్ట్ డీజిల్ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (Hyundai Grand i10) సెప్టెంబర్ 3, 2013వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, కొందరు హ్యుందాయ్ డీలర్లు ఈ చిన్న కారు కోసం ఇప్పటికే బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం.

మారుతి ఆల్టో 800 కారు విషయంలో, సదరు కారు వివరాలు పూర్తిగా తెలియక ముందే కస్టమర్లు బుకింగ్ చేసుకున్నట్లుగా, ఈ గ్రాండ్ ఐ10 విషయంలో కూడా కస్టమర్లు బుకింగ్‌ల కోసం క్యూ కడుతున్నారు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ ఇంజన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీ చేసేందుకే ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Hyundai Grand i10

ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఐ10, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 మోడళ్లకు మధ్యలో గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‍‌‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. సెప్టెంబర్ 3, 2013వ తేదీ ఉదయం 10.00 గంటల సమయంలో న్యూఢిల్లీలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ కారును విడుదల చేయనున్నారు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు బుకింగ్స్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని అధీకృత డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 28, 2013, 16:20 [IST]
English summary
According to sources, few Hyundai dealers have already started accepting bookings for the Grand i10. The Hyundai Grand i10 will be launched on 3rd September in New Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+