గ్రాండ్ ఐ10 రాకతో ఐ10 టాప్-ఎండ్ వేరియంట్స్ బంద్!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా.. లేటెస్ట్‌గా వచ్చిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు, రెగ్యులర్ ఐ10 మోడల్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే హ్యుందాయ్ రెగ్యులర్ వెర్షన్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లో ఆఫర్ చేస్తున్న కొన్ని వేరియంట్లను నిలిపి వేసింది. 1.2 లీటర్ కప్పా2 పెట్రోల్ ఇంజన్‌తో ఇదివరకు మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఐ10 ఇకపై మార్కెట్ నుంచి తొలగిపోనుంది.
హ్యుందాయ్ ఐ10కు, గ్రాండ్ ఐ10కు ధరలో మధ్య కొంత వ్యత్యాసాన్ని సృష్టించేందుకు గాను కంపెనీ స్పోర్ట్స్, ఆస్టా వేరియంట్లను (టాప్-ఎండ్ వేరియంట్లను) నిలిపివేశారు. హ్యుందాయ్ ఇటీవల తమ ఉత్పత్తుల ధరలను పెంచడంతో (గ్రాండ్ ఐ10 ధరను మాత్రం పెంచలేదు) రెగ్యులర్ ఐ10, గ్రాండ్ ఐ10 కార్ల మధ్య ధరల వ్యత్యాసం ఇంచు మించు సమానమైంది.

హ్యుందాయ్ ఐ10లో టాప్-ఎండ్ వేరియంట్లను నిలిపివేయటంతో ఇప్పుడు అది ఎరా, మాగ్నా అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఇందులో 1.1లీటర్ ఐఆర్‌డిఈ ఇంజన్ ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్లను నిలిపివేయటంతో, ఐ10లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కూడా కనుమరుగైపోయింది. ఇప్పుడు ఇది కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో మాత్రమే లభిస్తుంది. ఇదిలా ఉండగా, త్వరలోనే ఆటోమేటిక్ గ్రాండ్ ఐ10ను ప్రవేశపెట్టేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications








