హ్యుందాయ్ ఐ10 డీజిల్ వెర్షన్ కథ ముగిసినట్లే..!

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, తాజాగా దేశీయ విపణిలోకి గ్రాండ్ ఐ10 పేరుతో 'ఐ10' సిరీస్‌లో కొత్త కారును ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ 1.1 లీటర్, 3 సిలిండర్, యూ2 సిఆర్‌డిఐ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజన్‌ను యూరోపియన్ వెర్షన్ 2014 ఐ10 లోను ఉపయోగించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హ్యుందాయ్ నుంచి అతిచిన్న డీజిల్ ఇంజనే ఇదే కావటం మరొక విశేషం.

సరే ఇదంతా అటుంచితే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా, గ్రాండ్ ఐ10 డీజిల్ రాకతో ప్రస్తుతం హ్యుందాయ్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న పెట్రోల్ వెర్షన్ ఐ10 (రెగ్యులర్ మోడల్)లో డీజిల్ వెర్షన్ విడుదల ప్లాన్‌కు కళ్లెం పడినట్లయింది. గ్రాండ్ ఐ10లో ఉపయోగించిన 1.1 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఐ10 కారులో ఉపయోగించే ప్రసక్తే లేదని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

'1.1 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఐ10తో పంచుకునే ప్లాన్స్ లేవ'ని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ జనరల్ మేనేజర్, గ్రూప్ హెడ్ (మార్కెటింగ్) నలిన్ కపూర్ ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం, భారతదేశంలోని డీజిల్ ధరే.


ఇదివరకు డీజిల్ ధరను సబ్సిడికే విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు పెట్రోల్ కార్లను వదిలి డీజిల్ కార్లను కొనుగోలు చేసేవారు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి డీజిల్ ధరలపై ప్రభుత్వం పాక్షికంగా నియంత్రణ ఎత్తివేసి, ప్రతినెలా డీజిల్ ధరను పెంచుతూ పోవటం ద్వారా ఈ ఏడాది చివరి నాటికి సబ్సిడీ వలన తమపై పడుతున్న భారాన్ని తొలగించుకోవాలని సర్కారు యోచిస్తోంది. అంటే పూర్తిగా సబ్సిడీని ఉపసంహరించుకునే సన్నాహాలు చేస్తుందన్నమాట.

ఇదే గనుక జరిగితే కొద్ది రోజులకు పెట్రోల్, డీజిల్ ధరలు ఇంచుమించు సమానంగా ఉండి, డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గి పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరిగే ఆస్కారం ఉంది. వాస్తవానికి హ్యుందాయ్ కూడా ఇదే విషయాన్ని విశ్వసిస్తుంది. గడచిన ఆరు నెలలుగా గమనిస్తే, పెట్రోల్ కార్లు రివకరీ బాగుందని, భవిష్యుత్తులో కూడా ఇది ఇలానే కొనసాగే ఆస్కారం ఉందని కపూర్ అన్నారు.

Hyundai i10 Grand

హ్యుందాయ్ ఐ10 ఇప్పటికే పెట్రోల్ వెర్షన్ రూపంలో బాగానే అమ్ముడుపోతుంది. కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో ఐ10 కారుదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో, ఐ10 అమ్మకాలను పెంచుకునేందుకు ఇందులో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయ విపణిలో ఐ10 1.2 లీటర్ పెట్రోల్, 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో పాటు ఎల్‌పిజి ఫ్యూయెల్ ఆప్షన్‌తో కూడా లభిస్తోంది. హ్యుందాయ్ వ్యాఖ్యలు చూస్తుంటే, ఇక ఐ10 డీజిల్ కల కలగానే మిగిలిపోనున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, September 6, 2013, 15:14 [IST]
English summary
"There are no plans to share the 1.1 litre diesel engine with the i10", BS quotes Nalin Kapoor, senior general manager and group head marketing, Hyundai Motor India as saying. The reason behind Hyundai's decision is the uncertainty surrounding diesel pricing in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+