హ్యుందాయ్ కార్లపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్స్

గడచిన తొమ్మిది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో, అమ్మకాలను పెంచుకునేందుకు దాదాపు అన్ని కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే చెవర్లే, ఫియట్ కంపెనీలు ఇండిపెండెన్స్ డే సందర్భంగా తమ కార్లపై తగ్గింపులను అందిస్తుండగా, తాజాగా కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా 'ఫ్రీడమ్ సెలబ్రేషన్స్' పేరిట కంపెనీ అందిస్తున్న కార్లపై రూ.1.45 లక్షల వరకూ ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది.

పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ ఐ20, ఎలాంట్రా, వెర్నా మోడళ్లపై అలాగే పెట్రోల్ వెర్షన్ ఐ10, ఇయాన్, యాక్సెంట్, సొనాటా, శాంటాఫే మోడళ్లపై కూడా కస్టమర్లకు బెనిఫిట్లను అందిస్తోంది. సరసమైన డీల్‌లో చక్కటి హ్యుందాయ్ కారును కొనాలనుకునే వారికి ఇదే అనువైన సమయం. హ్యుందాయ్ ఏయే మోడళ్లపై ఎంత మేర ప్రయోజనాలను అందిస్తుందో క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత హ్యుందాయ్ డీలరును సంప్రదించండి. ప్రాంతాన్ని బట్టి ఆఫర్లు మారే ఆస్కారం ఉంది.

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్

కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ 67వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ పేరిట తమ కార్లపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుంది.

హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న చిన్న కారు ఐ10పై రూ.38,000 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్‌పై రూ.28,000 బెనిఫిట్స్, డీజిల్ వెర్షన్‌పై రూ.35,000 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న చిన్న కారు ఇయాన్‌పై రూ.21,250 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ శాంత్రో

హ్యుందాయ్ శాంత్రో

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న పెట్రోల్ కారు శాంత్రోపై రూ.29,350 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ యాక్సెంట్

హ్యుందాయ్ యాక్సెంట్

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ పెట్రోల్ సెడాన్ యాక్సెంట్‌పై రూ.30,700 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ సొనాటా

హ్యుందాయ్ సొనాటా

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ సెడాన్ సొనాటాపై రూ.1.39 లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ ఎలాంట్రా డీజిల్

హ్యుందాయ్ ఎలాంట్రా డీజిల్

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రా డీజిల్‌పై రూ.65,000 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న మిడ్ సైజ్ సెడాన్ వెర్నా పెట్రోల్‌పై రూ.25,000 బెనిఫిట్స్, డీజిల్ వెర్షన్‌పై రూ.35,000 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ శాంటాఫే

హ్యుందాయ్ శాంటాఫే

హ్యుందాయ్ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీపై రూ.1.45 లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 14, 2013, 10:21 [IST]
English summary
Hyundai Motor India is offering huge discounts to boost sales. Now Hyundai customers can get benefits of up to Rs. 1.45 lakhs. Last month, Hyundai India registered a negative growth that is probably one of the reasons for such an expansive list of offerings.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+